Suryaa.co.in

Andhra Pradesh

అంగన్వాడీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి

-వారి న్యాయమైన డిమాండ్లు తీర్చకుండా పోలీస్ జులుం
-వచ్చే ఎన్నికల్లో మహిళల చేతిలో జగన్ రెడ్డి ఓటమి ఖాయం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

తెలంగాణ కంటే ఎక్కువ జీతాలిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు ఊదరగొట్టిన జగన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం. మాట తప్పను-మడమ తిప్పను అంటే ఇదేనా జగన్ రెడ్డీ? కనీస వేతనం రూ. 26 వేలు చేయడంతో పాటు తమ న్యాయబద్ధమైన డిమాండ్లు అమలు చేయాలని నాలుగేళ్లుగా అంగన్వాడీలు శాంతియుత ఆందోళన చేస్తున్నా జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు.

పైగా చలో విజయవాడకు వచ్చిన అంగన్వాడీలపై పోలీసుతో లాఠీ దెబ్బలు కొట్టించిన ఘనత జగన్ రెడ్డిదే. ఆదాయ పరిమితి నిబంధన తెచ్చి అంగన్వాడీలకు సంక్షేమ పథకాల్లో కోత పెట్టారు. ఉద్యోగ భద్రత కల్పించా లని, కనీస వేతనం చెల్లించాలని, పెన్షన్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీవంటివి అమలుచేయాలని నాలుగేళ్లుగా అంగన్‌వాడీ ఉద్యోగులు కోరుతున్నా జగన్ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. కేంద్రాల పర్యవేక్షణ పేరుతో వివిధ కమిటీలు, రాజకీయ నాయకులు అంగన్‌వాడీ సిబ్బందిని వేధిస్తూ అవమానాలకు గురిచేస్తున్నా జగన్ రెడ్డిలో చలనం లేదు.

అంగన్వాడీలకు పూర్తిస్థాయిలో సంక్షేమం అందించి వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబు గారిదే. అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం రూ. 10, 500 చేశాము. జీతాల పెంపుతో పాటు గడిచిన ఐదేళ్లలో 18,301 అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తే జగన్ రెడ్డి నాడు-నేడు కింద అంగన్వాడీల అభివృద్ధి పేరుతో నాలుగేళ్లుగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇకనైనా జగన్ రెడ్డి కల్లబొల్లి మాటలు కట్టిపెట్టాలి. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి, వారి న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలి.

LEAVE A RESPONSE