– ఐశ్వర్యానికి మూల బిందువు.. ఆవు!
గోమాత పేడనుండి గ్యాస్ ఉత్పత్తి గావించడం, అందరికి తెలిసిన విషయమే! అయితే యిపుడు క్రొత్తగా పేయింటింగ్ ను సైతం ఉత్పత్తి గావించ వచ్చని తెలిసింది. ఇది మహా అద్భుతం. ఈ పెయింటింగ్ మల్టీ నేషనల్ కంపెనీల పెయిటింగ్ మరియు ఆయిల్ పెయింటింగ్ కు ధీటుగా ఉందని పరిశీలించి మరీ నిరూపించినట్లు తెలుస్తుంది. మరియు రేటు విషయంలో మల్టీ నేషనల్ కంపెనీల పెయింట్స్ రేటుతో పోలిస్తే సగం మాత్రమే. నాణ్యత సమానమే కాకుండా హెచ్చు అనవచ్చును.
మహర్షి దయానంద సరస్వతి తొలిసారి విదేశీయుల పాలనలో ఆవు వలన కలుగు ఉపయోగాలను, ఆర్థిక లాభాలను గణాంకాలతో సహా అందించారు… ఇప్పుడు మన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మహర్షి మార్గములో పయనిస్తూ ఆర్థిక లాభాన్ని మనముందుంచారు.
ఆరోగ్యవంతమైన ఆవు (30 )కిలోల పేడనిస్తుంది. కాస్త బలహీనమైన ఆవు సైతం కనీసం (20) కిలోల పేడ నిస్తుంది. పేడ ధర కిలోకు రూ.5/-. ఒక రోజుకు ఒక ఆవు రూ.150/-. ఆదాయాన్ని రైతుకందిస్తుంది. పది ఆవులను పెంచితే రైతు దినసరి ఆదాయం రూ.1500/-.ఈ లెక్కన నెలకు (10) ఆవులనుండి రూ 45000/-ఆదాయం వస్తుంది.
ఇదిగాక గోవునుండి గోమూత్రము, పాలు, పెరుగు, మజ్జిగ,వెన్న,నెయ్యి లభ్యమవుతాయి. వీటిని సైతం రైతులు అమ్ముకొనవచ్చును. గడ్కరీ జయపూర్ లో పెయింటింగ్స్ ను తయారు చేసే కేంద్రం ఉందని, ఔత్సాహికులకు ఉచిత శిక్షణనిస్తామంటు న్నారు. పరిశ్రమ పెట్టడానికి సబ్సిడీ లోన్ లు సైతం యిప్పిస్తామంటున్నారు. గో ఆధారిత ఉత్పత్తులను ప్రపంచానికి మనము పరిచయం చేయగలిగితే,
“గావో విశ్వస్య మాతరః” ఆవులు విశ్వమాత లని ఋజువు అవుతుంది.*
గోవును వధించి తినువారు మలమునుత్పన్నము చేయుట మినహా మరేమి చేయుట లేదు. తమ దుర్గంధ పూరితమైన మలమును అధికముగా ఉత్పత్తి గావించి, పరమేశ్వర రచిత శుద్ధ ప్రకృతిని చెఱుస్తున్నారు. విశ్వ మానవాళి అనారోగ్యమునకు కారణభూతులగుచు న్నారు. ఆ కాలుష్య వాతవరణాన్ని శుద్ధి చేయాలంటే, తిరిగి ఆవు నెయ్యితోనే యజ్ఞం చేయాలి. మాంస భక్షణ చేయు వారికి ‘కాన్సర్’ వ్యాధికి గురి కావడం ఖాయం అంటున్నారు… కొంతమంది డాక్టర్లు. ఆ కాన్సర్ వ్యాధి నివారణకు గో మూత్రమే శరణ్యం. గోవు దరిద్రుణ్ణి ఐశ్వర్యవంతుడిని చేస్తుంది. మెకాలే విద్యల వలన గోవులు కాయడం నీచంగా చూడబడింది.
హిందువులు మెకాలే విద్యల వలన ఉద్యోగములను పొంది తమను తాము మహిమాన్వితులుగా భావిస్తున్నారు. కొద్ది డబ్బుకు మురిసి, వ్యవసాయము, పశు పోషణల ద్వారా కలుగు మహదైశ్వర్యాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారు. మహదైశ్వర్యమే కాదు,బ్రహ్మ జ్ఞానాన్ని సైతం కోల్పోతున్నారు.
అజ్ఞాత కులమునందుత్పన్నుడైన జాబాలి పుత్రుడు సత్యకాముడికి ఉపనయన వేదారంభ సంస్కారాలు జరిపించి హరిద్రుమతుడు (600)గోవులు యిచ్చి,అవి(1000)అగు వరకు ఆశ్రమానికి రావలదని ఆదేశించాడు.
గురువాజ్ఞను శిరసావహించి ఆవులను తోలుకొని, అడవులలో సంచరించాడు. అతడి దినచర్య ఆవులను మేపడం, వాటి పాలు త్రాగడం,,గురువు నేర్పిన సంధ్యాగ్నిహెూత్రములు ఉభయ వేళలలో చేయడం.
అంతే అతడు వేయి గోవులగుసరికి బ్రహ్మ జ్ఞానియయ్యాడు. గోసేవ వ్యర్థంగా పోదు.నిష్కారణంగానైనా గో సేవ చేయాలి.
….ప్రభాకర శర్మ(9963456923).
”మంచి పాలు ఏ జంతువు నుండి లభిస్తాయి?” అని ఒక ఇంగ్లిష్ వాడు స్వామి వివేకానందుని అడిగాడు.
”గేదె పాలే శ్రేష్ఠం!” వివేకానందుని జవాబు.”
ఇంగ్లీషు వాడు: ”కానీ మీరు ఆవుని సర్వ శ్రేష్ఠమైనది గా భావిస్తారు కదా! కాదా?”
స్వామి: “కానీ మీరు పాల గురించి అడిగారు. అమృతం గురించి కాదు. రెండో విషయం జంతువు గురించి అడిగారు. కానీ ఆవు మా తల్లి. జంతువు కాదు.”
– కెర్లెపల్లి బాలసుబ్రమణ్యం
పుంగనూరు