వైసీపీ నేతల అండతో ప్రజల్ని వేధించి, హింసించి దారుణాలకు పాల్పడుతున్న వాలంటీర్లనే తప్పుపడుతున్నాం
– వ్యవస్థకు చెడ్డపేరు వచ్చేలా హద్దులుమీరి ప్రవర్తించే వాలంటీర్లు, వారికి అండగా నిలుస్తున్న వైసీపీనేతలు, మంత్రులపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోరు?
• టీడీపీప్రభుత్వం వాలంటీర్, సచివాలయ వ్యవస్థను రద్దుచేయదు. దాన్ని గాడిలో పెట్టి, ప్రజలకు జవాబుదారీగామార్చి, రాష్ట్రాభివృద్ధికోసం వినియోగిస్తుంది.
• వాలంటీర్లు సేకరించిన ప్రజల సమాచారం ప్రైవేట్ ఏజెన్సీలకు చేరడంపై ముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతారు?
• వాలంటీర్లు ప్రజాసేవకులు అంటూ వారితో గొడ్డుచాకిరీ చేయించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, వారిసమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎందుకు పట్టించుకోడు?
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
వాలంటీర్ వ్యవస్థ పనితీరు, దాని లోటుపాట్లపై మాట్లాడేవారిపై జగన్మోహన్ రెడ్డి, అత ని సాక్షి మీడియా విషప్రచారానికి తెరలేపిందని, తెలుగుదేశం పార్టీ ఏ వ్యవస్థకు ఎప్పుడూ వ్యతిరేకంకాదని, ప్రజలకు నిస్వార్థంగా సేవలుచేసేలా వ్యవస్థ లు సక్రమంగా చట్టబద్ధంగా పనిచేయాలన్నదే టీడీపీ అభిమతమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ వాలంటీర్లుగా పనిచేస్తున్నవారిలో దళితులు, బడుగుబలహీనవర్గాల యువతీ యువకులే ఎక్కువగా ఉన్నారు. వారిని తనస్వార్థానికి వినియోగిస్తున్న జగన్ రెడ్డి, వారుసేకరించిన సమాచారాన్ని తనకుయుక్తులు, కుట్రలకు వాడుకుంటు న్నాడు. కొంతమంది వాలంటీర్లను జగన్, అతనిప్రభుత్వం బానిసలుగా మార్చుకొని, మొత్తం వ్యవస్థనే భ్రష్టుపట్టించే పనిలో నిమగ్నమయ్యాడు. దాన్నే మేం తప్పుపడుతున్నాం. వాలంటీర్ వ్యవస్థను రద్దుచేస్తామని మేం, మా పార్టీ ఎక్కడా చెప్పలేదు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి నారాలోకేశ్ కూడా యువగళం పాదయాత్ర ప్రారంభంలో చెప్పారు.
వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని, స్వార్థానికి వాడుకోవడాన్నే తాము తప్పుపడుతున్నాం
జగన్ అవినీతి, అక్రమార్జన కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి వాలంటీర్లలో 95శా తం మంది వైసీపీకార్యకర్తలేనని ఆగస్ట్ 26, 2021న బహిరంగంగానే చెప్పాడు. వాలం టీర్లు అందరూ మనవాళ్లే..మనమే వారిని నియమించామని.. మనంచెప్పిందే చేయాలని జూలై 22 2022న మంత్రి అంబటి రాంబాబు మాట్లాడాడు.
వాలంటీర్ల వ్యవ స్థను మేమే తీసుకొచ్చాము… మేంచెప్పిందే వారుచేయాలంటున్నది వైసీపీవాళ్లు… ఎమ్మెల్యేలు మంత్రులే. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగంచేయడాన్ని, వైసీపీనేతలు తమస్వార్థానికి వాడుకోవడాన్నే మేం తప్పుపడుతున్నాం. వాలంటీర్లతో వైసీపీ సభలకు జనాల్ని తరలించడం.. సభలకురాకపోతే పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు బెదిరింపులకు దిగడం వంటిపనులు ఎంతమాత్రం సరైనవి కాదన్నదే మా అభిప్రాయం.
కొందరు వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారిపోయి, ప్రజల్ని వేధించి, బెదిరించే స్థాయికి వచ్చారంటే దానికికారణం వైసీపీనేతలే
రాష్ట్రవ్యాప్తంగా కొందరువాలంటీర్లు అసాంఘికశక్తులుగా మారిపోయి, ప్రజల్నిభయపెట్టి తాము ఏది అనుకుంటే అది జరగాలంటున్నారు. స్థానిక వైసీపీఎమ్మెల్యేలు, కిందిస్థా యి నేతల అండతో చెలరేగిపోతున్నారు. మహిళల్ని వేధించడం, ఇళ్లలోకి చొరబడి వారిని హింసించడం, సామాజిక పింఛన్లు ఇవ్వకుండా, తమఅవసరాలకు వాడుకోవ డం, రైతులకు తెలియకుండా వారి భూముల్ని ఇతరులపేర్లతో మార్పించేయడం.. వాటిపై రుణాలుతీసుకోవడం లాంటి ఘటనలు అనేకం ప్రసారమాధ్యమాల్లో చూశాం. అనేకపత్రికలు, టీవీల్లో నిత్యం ఏదోఒకచోట ఫలానా వాలంటీర్ ఫలానా ఘనకార్యం చేశాడని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారివల్ల మొత్తం వాలంటీర్ వ్యవస్థే తలదించు కునే పరిస్థితి వచ్చింది.
వాలంటీర్లు సేకరించిన ప్రజల సమాచారం ప్రైవేట్ ఏజెన్సీలకు వెళ్లడంపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు?
వాటితో ఆగకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ సమాచారంపేరుతో సేకరించిన వివరాల్ని, ముఖ్యంగా ప్రజల గోప్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించిందనే నిజాలు బయటకువ స్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ఏంచెబుతారు? భార్యాభర్తలు, తల్లీబిడ్డలు, అన్నదమ్ముల మధ్య ఉండే వ్యక్తిగత వివరాల్ని సేకరించాల్సిన అవసరం వాలంటీర్లకు ఏమొచ్చింది? అలాంటి వివరాల్ని బయపెట్టి, ప్రజల్ని బెదిరించడం ఎంతవరకు సబబు? అలానే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు పెట్టే వేధింపులు తట్టుకోలేక చాలా మంది వాలంటీర్లు ఆత్మహత్యాయత్నం చేశారు.
వాలంటీర్లతో గొడ్డుచాకిరీ చేయించు కుంటూ, తిరిగివారినే అధికారపార్టీనేతలు ఇష్టానుసారం దూషిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదలరజనీ తనకార్యక్రమానికి హాజరుకా లేదన్న అక్కసుతో ఒకేసారి 16మంది వాలంటీర్లను తొలగించింది. చిత్తూరునగరంలోని 11వ డివిజన్లో శరవణన్ అనే వార్డు వాలంటీర్ వైసీపీనేతల వేధింపులు తట్టుకోలేక లేఖరాసి మరీ ఆత్మహత్యాయత్నంచేశాడు. ఇలాంటిఘటనలు అనేకమున్నాయి. వాలంటీర్లు సేవకులు..వారిసేవలు మాకు అవసరమ ని చెప్పే ముఖ్యమంత్రి ఏనాడూ వారి గురించి ఆలోచించింది లేదు. వైసీపీనేతలు వారిని వేధిస్తున్నా ఏనాడూ ముఖ్యమంత్రి తనపార్టీవారిని వారించిందిలేదు.
చట్టాలు, నిబంధనలకు వ్యతిరేకంగా వాలంటీర్లు చేసే పనులకు ముఖ్యమంత్రే బాధ్యుడు
వాలంటీర్లను నియమించింది ప్రజాసేవకు అని ముఖ్యమంత్రే చెబుతున్నారు. మరి వారితో అధికాపార్టీవారు సొంతపనులు చేయించుకోవడం, తామంటే గిట్టనివారిపై వారి ద్వారా కక్షసాధింపులకు పాల్పడటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి పథకాలు తొలగిస్తా మని బెదిరించడం ఎంతవరకు సరైంది? వాటితో ఆగకుండా వైసీపీప్రభుత్వం వాలంటీర్ల ను స్థానికసంస్థల ఎన్నికల్లో వినియోగించుకొంది. వాలంటీర్లను ఇళ్లకుపంపి, అధికార పార్టీ వారికే ఓటేయాలని బెదిరించింది నిజంకాదా?
అలానే రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికలకోసం ఇప్పటినుంచే వాలంటీర్లను వాడుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఓట ర్ల జాబితాను వాలంటీర్లతో తనిఖీచేయించడం, వైసీపీకి పడవనుకున్నఓట్లను తొలగించడం, ఎన్నికలసంఘం నిబంధనలకు విరుద్ధం కాదా? ఎన్నికలసంఘాన్ని ఖాతరుచేయకుండా, వాలంటీర్లను అడ్డుపెట్టుకొని టీడీపీ, ఇతరపార్టీల సానుభూతి పరులు, కార్యకర్తల ఓట్లు తీసేయడాన్ని ఏమనాలి?
వాలంటీర్లు చేసే పనులు, వాటివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. తప్పుచేసే వాలంటీర్లను, వారిని ప్రోత్సహించే అధికారులు, ప్రభుత్వాన్నే తాము నిలదీస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అస్తవ్యస్తమైన వాలంటీర్ వ్యవస్థని సరైనదారిలోపెట్టి, ప్రజలకు జవాబుదారీగామార్చి, సక్రమంగా జనానికి సేవలు అందించేలా దాన్ని తీర్చిదిద్దుతుంది.” అని ఆనంద్ బాబు పేర్కొన్నారు.