Suryaa.co.in

Andhra Pradesh

దళిత బాలిక మృతిపై సమగ్ర దర్యాప్తు

– జిల్లా ఎస్పీకి మహిళా కమీషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశం

తొమ్మిదో తరగతి చదువుతున్న కృష్ణా జిల్లా పామర్రు కు చెందిన బాలికపై సామూహిక అత్యాచారం జరగడం, అనుమానాస్పద స్థితిలో ఆమె మృతిచెందడం పై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు.

ఈ సందర్భంగా కేసు విచారణా వివరాలను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివరించారు.CC ఫుటేజ్ వివరాలను వెల్లడించారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని 15 రోజులలో చార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాసిరెడ్డి పద్మ కు తెలిపారు. నిందితులకు కరిన శిక్ష పడే వరకు విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

LEAVE A RESPONSE