ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలన సందర్భంగా జన సంపర్క్ అభియాన్ లో భాగంగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జన వాడే సంగప్ప నారాయణఖేడ్ లో పలువురు ప్రముఖుల తో భేటీ అయ్యారు. సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమం సందర్భంగా నారాయణఖేడ్ లో ప్రముఖ వ్యాపార సంస్థ లక్ష్మీ
ఇంజనీరింగ్ యజమాని బూస అశోక్ , ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకటేశం ని కలిసి మోడీ పాలనకు సంబంధించిన మ్యాగజిన్ ను అందించారు.
తొమ్మిదేళ్లలో మోడీ దేశంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులను, ప్రపంచ దేశాల్లో దేశానికి గౌరవాన్ని పెంచిన విధానాన్ని సంగప్ప వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సంగప్ప వెంట బీజేపీ నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, సీనియర్ నాయకులు సంజు పాటిల్, సగనాకర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.