– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
– మంగళగిరిలో 20వేల ఇళ్ల నిర్మాణానికి శిలాఫలకం
రాష్ట్రంలో అరాచకపాలనపై సమరభేరి మోగిస్తూ 5కోట్ల ప్రజల జనగళమే యువగళమై సాగుతున్న చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ఈరోజు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో 2500 కి.మీ.ల మైలురాయి చేరుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇళ్లులేని 20వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించాను. దీంతోపాటు అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్దీకరించి పట్టాలు అందజేస్తానని నేను మాట ఇస్తున్నాను.