Suryaa.co.in

Telangana

పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలి

కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినేపల్లి మండలానికి చెందిన పలువురు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. త్వరలో జరిగే ఎన్నికల తర్వాత వచ్చేఇందిరమ్మ రాజ్యంలో అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

శనివారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినేపల్లి మండలానికి చెందిన పలువురు సర్పంచులు వెంకటస్వామి, అమృత్ రెడ్డి, తిరుపతయ్య, ఎంపీటీసీ అంజి, మాజీ సర్పంచులు అలియా నాయక్, రాంచందర్, మాజీ ఎంపీపీ రాములు, వార్డు సభ్యులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామన్నారు రేవంత్ రెడ్డి.

పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు మీరు గెలిపిస్తే రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత తమదన్నారు రేవంత్ రెడ్డి. గ్రామ గ్రామాన తిరగండి… ప్రతీ తలుపు తట్టండి బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు 5లక్షలు అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. కాంగ్రెస్ వస్తుంది… రూ.2లక్షల రుణమాఫీ చేస్తుంది..అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాంరూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు.

LEAVE A RESPONSE