పాతపద్దతులే మేలు
హాయిగా.. తృప్తిగా, కావలసినంత, మితంగా తిందాం, తరవాత 60..65..70. 80…90కి ఎప్పుడు అయినా పోదాం.
ఈ కాస్తదానికి, ఎందుకు ఇంత తపన, తాపత్రయం.. అంతులేని ఆరాటం ?
కొర్రలు, అరికలు అంటూ గడ్డి గాదం తిని .. మినరల్ వాటర్లూ, ఈ కంగెన్ వాటర్లూ తాగి
100 ఏళ్లు బతికితే, మనల్ని గుర్తుపట్టే మనిషి ఉండొద్దా?
మనవాళ్లంతా 50…60కే పోతే.. మనం మాత్రం ఉండి ఏం చేస్తాం ?
ఎప్పటికప్పుడు.. update అయిపోయిన లోకంలో పక్క వాడిని పలకరించే సమయం లేక…. బిజీ అయిపోయిన మనుషుల మధ్య …
మన మొహం కూడా తెలియని ముని మనవలు, మనవరాళ్ల మధ్య ఉండి ఏం చేయాలి ?
బతికి ఉన్నా….. డబ్బు ఖర్చు… మనం సంపాదించలేని స్థితిలో … మన మీద అంత ఖర్చు పెట్టేది ఎవరంట ?
మనమేమన్నా టాటా… అంబానీలమా.. వేల కోట్లు ఉండి బతికినంత కాలం ఖర్చు పెట్టుకోడానికి ?
అయినా ఆ మాటకు వస్తే …
ఈ కొర్రలు, అరికలు …
వీటి కంటే ముందు …
అసలు మొదటి మానవుడు …
పచ్చి మాంసం తిని.. అప్పుడే చంపిన జంతువు వేడి రక్తం తాగి బలంగా ఆరోగ్యంగా బతికాడు .. అని చెబితే ఎలా ఉంటుంది ?
కాబట్టి అతిగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించొద్దు…
అలాగని పూర్తిగా అశ్రద్ధ చేయొద్దు…
ఉన్నంతలో కాస్త తక్కువ తినడం .. ఎక్కువ పని చేయడం..
ఏదైనా వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం సరిపోతుంది.
ఆనందంగా ఉండటం, ..స్ట్రెస్ ని దగ్గరికి రానీయక పోవడం.. నచ్చిన కళ.. హాబిని సాధన చేయడం మరవకూడదు.
ఆనందమే ఆరోగ్యానికి మూలం.
30 రూ. 40 రూ ల బియ్యం కొనుక్కునే స్థోమత కలిగిన ఇండియాలో… 200 రు. కిలో ఉన్న ధాన్యాలని కొనిపించి.. తినిపించగల తెలివి డైట్ రూపంలో ఎలా స్కాం చేస్తోందో చూడండి..
ఒకప్పుడు నీరసం గా రసాలు తాగమనే మంతెన… మొన్న నూనెని తాగమన్న వీరమాచినేని…
ఇప్పుడు అన్నాన్నే మానేయమంటున్న షేక్.
ఎవరి టైం వారిది..
ఎవరి సంపాదన వారిది..
కాని మన ఆరోగ్యం మనదే.
ఎప్పటికీ అన్నం , పప్పు… కూరలు.. మాత్రం మానకండి.
హాయిగా పచ్చళ్ళు, చార్లు, పులుసులు తినండి..
మన దగ్గర పారుతున్న నది మనకి జీవనది…
అలానే మన దగ్గర పండే ఆహారమే మనకి జీవశక్తి.
మంచిగా ఉండండి…
హాయిగా తిని ప్రశాంతంగా నిద్రపోండి.
– వెలగపూడి గోపాలకృష్ణ