Suryaa.co.in

Andhra Pradesh

టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా మరో ఐదుగురికి ఉద్యోగాలు

ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా మరో ఐదుగురికి ఉద్యోగాలు లభించాయి. టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ లో ఐటి రిక్రూటింగ్ లో శిక్షణ పొందిన ఎన్ మాధవి, వి ఉషారాణి, జి బాలయోగి, వి రత్నకుమార్, కె చెన్నకేశవులు హైదరాబాద్ లోని బెనెడ్ సాఫ్ట్ సొల్యూషన్స్ లో ఉద్యోగాలు పొందారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగాలు పొందిన వారిని అభినందించారు. ఎన్ఆర్ఐ టిడిపి చీఫ్ డాక్టర్ వేమూరు రవికుమార్, టిడిపి బ్రాహ్మణ సాధికారత సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ బుచ్చి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE