– అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేసి అతన్ని అరెస్టు చేసి చెంచల్ గూడ జైలుకు పంపాలి
– అసలు కుట్రదారులు ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్న ఏ-8 అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేసి వెంటనే అతనిని అరెస్టు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడిన మాటలు ..
ఏ6 ఉదయ్ రెడ్డి, ఏ7 వైఎస్ భాస్కర్ రెడ్డిల కంటే ఎక్కువగా ఏ8 అవినాష్ సాక్షులను భయపెట్టగలడు, ప్రభావితం చేయగడు కనుక ఏ8 యొక్క ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలి. తెలంగాణ హైకోర్టు లో ఏ6 ముద్దాయి ఉదయ్ రెడ్డి, ఏ7 ముద్దాయి భాస్కర్ రెడ్డి లకు బెయిల్ ఇవ్వడం కుదరదని జడ్జీగారు తేల్చి చెప్పారు.
నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేయగలరని తీర్పులో పేర్కొన్నారు. పారదర్శకతతో కూడిన విచారణ జరగదని బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించారు. నిందితులు సీఎంకు అత్యంత దగ్గరి బంధువులు, రాజకీయంగా బలవంతులు కావున వారు బయట ఉంటే, సాక్షులకు రక్షణ లేదు, పారదర్శకంగా విచారణ జరగదు. ఏ8 అవినాష్ పార్లమెంట్ మెంబర్, బలమైన శక్తి.. రెవెన్యూ, పోలీస్ అధికారులు అవినాష్ చెప్పుచేతల్లో ఉంటారు. సాక్ష్యులను ప్రభావితం చేయగలరు, భయపెట్టగలరు.
A-8 ముద్దాయి అవినాష్ రెడ్డిని వెంటనే కష్టడీలోకి తీసుకొని చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు పంపాలి. మొత్తం గవర్నమెంట్ మిషనరి, లా అండ్ ఆర్డర్ వారి చేతుల్లో ఉంది గనుక ఏ 8 ముందస్తు బెయిల్ వెంటనే రద్దు చేయాలి. వెంటనే సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి ఏ8 ముందస్తు బెయిల్ రద్దు చేయించాలి. సీబీఐ అధికారుల మీద ప్రైవేటు కేసులు వేసిన ఘనాపాఠీలు ఈ ముద్దాయిలు.
వివేకా హత్యకు, తనకు ఎటువంటి సంబంధంలేదని ఇప్పటికి కూడా సీఎం ఒక్క స్టేట్ మెంట్ ఇవ్వలేదు. దీన్ని బట్టి సీఎంకు తెలిసే హత్య జరిగివుండొచ్చు. అవినాష్ తల్లి కర్నూలు ఆస్పత్రిలో ఉందంటే సీబీఐ సైతం అవినాష్ ని కష్టడీలోకి తీసుకోలేకపోయింది. సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య సస్పెన్షన్ ఎత్తేశాక 164 సీఆర్ పీసీ R/W వాంగ్మూలం ఇవ్వలేదు. సీబీఐకి అనుగుణంగా ఉండాల్సిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య వ్యతిరేకంగా మారాడు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి అతి ఘోరాతిఘోరంగా గొడ్డలితో చంపబడ్డాడు. మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో పెట్టుకొని సొంత బాబాయి హంతకులకు శిక్ష వేయించలేకపోయారు. ఎవరు చస్తే నాకెందుకు అనే ధోరణిలో జగన్ ఉన్నారు. ఏ6 ఉదయ్ రెడ్డి, ఏ7 వై. భాస్కర్ రెడ్డిలు తమకు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు వచ్చిన పిటిషన్ లో సీబీఐ అడ్వకేట్స్ వారి వాదనలు వినిపించారు.
ముద్దాయిల తరపున ఆస్తాన రాజ్యసభ మెంబర్ నిరంజన్ రెడ్డిలు తమ తమ వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టు సుస్పష్టంగా వారి బెయిల్ ను తిరస్కరిస్తూ ఆర్డర్ ఇచ్చి మంచి పని చేసింది. అధికారంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడికి సాక్ష్యులను ప్రభావితం చేయడానిక ఎక్కువ సమయం పట్టదు. కావున సాక్ష్యులను ప్రభావితం చేయగలడు. కాబట్టి వెంటనే ఏ8 ముద్దాయి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేసి అతన్ని అరెస్టు చేసి చెంచల్ గూడ జైలుకు పంపాలి.
గతంలో సీఐ శంకరయ్య సస్పెన్షన్ ఎత్తేశారు. ఎత్తేయగానే సీబీఐవారు నన్ను ఇబ్బంది పెట్టారని ఎస్పీకి లేఖ రాశారు. మర్డర్ లో పాత్రధారి, సూత్రధారి అయిన సీఐ సస్పెన్షన్ ఎత్తేయగానే , కేసులో భాగస్తుడైన సీఆర్ పీసీని వ్యతిరేకించాడు. ఇలా మారిపోయే అవకాశాలున్నాయి. కావున వెంటనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ని రద్దు చేసి చంచల్ గూడ జైలుకు తరలించాలి.
అసలు కుట్రదారులు ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు, వారిభరతం పట్టాలి, లోతుకు వెళ్లి విస్తృత స్థాయి కుట్రను వెలికితీయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు.