తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు అక్రమం… అప్రజాస్వామికం
జగన్మోహన్ రెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట
తెలుగుదేశం పార్టీ ప్రభంజనానికి భయపడిపోయి, రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో, కక్ష్య సాధింపు ధోరణితో చంద్రబాబును అరెస్టు చేయడం ప్రజాస్వామికం. చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటనలకు ప్రజల స్పందన చూసి. మరొక వైపు లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న అపురూప స్పందనకు బెంబేలెత్తిపోయి వైయస్ జగన్ దిక్కుతోచని స్థితిలో, రేపు గ్యారెంటీగా ఓటమి తప్పదనే భయంతో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జరిగింది.
ఈ అక్రమమైన అప్రజాస్వామికమైన చర్యను తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తున్నాము. తెలుగుదేశం తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు పి.సాయిబాబా ఆదేశాల మేరకు ఈ అరెస్టును ఖండిస్తూ సికింద్రాబాద్ పార్లమెంటు ఆధ్వర్యంలో అశోక్ నగర్ చౌరస్తాలో ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ దిష్టి బొమ్మను దగ్దం చేసారు.
మాజీ ముఖ్యమంత్రి, 14 సం..లు ముఖ్యమంత్రిగా పని చేసిన జడ్+ క్యాటగిరి భద్రత కలిగి ఉండి, నిరంతరం ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుని ఈ విధంగా దారుణంగా నిన్న అర్ధరాత్రి ఒక నేరస్తుడిలా అరెస్ట్ చేయడం చాలా విచారకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి వికృత చర్యలను ఖండిస్తున్నాము. “ముందున్నది ముసళ్ళ పండగ”.రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్ ఓటమి తప్పదని, వాస్తవాలన్నీ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని నాయకులు అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమం జరిగింది అని తల, తోక లేని కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి పైచాశిక ఆనందం పొందుతున్నారని, ఈ అక్రమఅరెస్టు పై ప్రజా ఆగ్రహాన్ని, నిరసనను ఎదుర్కొనడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండాలన్నారు.జగన్మోహన్ రెడ్డి తనపైఉన్న కేసులకు ఎదో ఒక రోజు జైలుకు పోవడం ఖాయమని అన్నారు. పూర్తి నీతి నిజాయితీతో చంద్రబాబు బయటకు వస్తారని అన్నారు.దాదాపు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 32 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిపాలనలో రాష్ట్రం అధోగతి పాలు అవుతుంది అని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుమీద అక్రమంగా శనివారం నాడుఅరెస్టు చేయడాన్ని ఖండించారు. చేతకాని ఈ వైసీపీ ప్రభుత్వం తెదేపా నాయకులను అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని.. ఓడిపోతామని గమనించిన జగన్ రెడ్డి, బాబు ని నిలువరించడానికి చేసే ప్రయత్నమే ఈ అక్రమ అరెస్ట్ అని తెలిపారు. సంబంధం లేని కేసులతో అరెస్టు చేయడం అత్యంత దారుణమని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే ఉందని, చంద్రబాబు అక్రమ అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఇన్చార్జులు బిల్డర్ ప్రవీణ్, శ్రీకాంత్ ముదిరాజ్, టిఎన్.టియిసి రాష్ట్ర అధ్యక్షులు ఎం.కె. బోసు, ఆర్.భాస్కర్, జి.మధు సూధన్, నల్లా అనిల్, అశోక్, సిహెచ్. ప్రదీప్ గౌడ్, బాను ప్రకాష్, సుధాకర్, సత్యనారాయణ, సత్తన్న, రాజు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.