సిగ్గుపడాలనడం సిగ్గే సిగ్గుపడేలా ఉన్నాయి
అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడంలో జగన్ ఎందుకు చూపలేదు?
జగన్ టీంకు ఒక న్యాయం? ప్రతిపక్షాలకు ఒక న్యాయమా?
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
16 నెలలు చెంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ 16 రోజులైనా చంద్రబాబును జైల్లో ఉంచాలని జగన్ ఆకాంక్ష అని ఆయన ఆకాంక్ష కు అనుగుణంగా చంద్రబాబును జైలుకు పంపి చూపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సోమవారం జూమ్ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు ..
పాలకులు అవినీతిపరులైతే నీతిమంతులు జైల్లో ఉంటారని ఫిడెల్ క్యాస్ట్రో చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయి. . జగన్ మన రాష్ట్ర పాలకుడు(ముఖ్యమంత్రి) అవినీతిపరుడిగా ముద్ర పడిన వ్యక్తి. అవినీతిపరుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి నీతిమంతులు జైలుకెళ్లాలి, అందులో భాగంగానే చంద్రబాబు జైలుకు వెళ్లడం జరిగింది. జగన్ కబంధ హస్తాల నుంచి చంద్రబాబును కాపాడాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కనకదుర్గమ్మను వేడుకుంటే.. ఓ మహిళా మంత్రి వ్యంగ్యంగా మాట్లాడటం, సిగ్గుపడాలనడం సిగ్గే సిగ్గుపడేలా ఉన్నాయి.
కక్ష, పగ, ఈర్ష్య, ద్వేషాలలో భాగమే చంద్రబాబు అరెస్టు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు అహోరాత్రులు కృషి చేశారు. సీఐడీ చీఫ్ సంజయ్ తన తాహతును దిగజార్చుకుని సమాజంలో అభాసుపాలయ్యారు. జగన్ ఆడిన ఈ చదరంగంలో అనేకమంది పావులుగా మారారు. చంద్రబాబును అరెస్టు చేయడంలో చూపిన చొరవ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడంలో జగన్ ఎందుకు చూపలేదు?
వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపిన నిందితులను పట్టుకోవడంలో ఏమైంది మీ సామర్థ్యం? నిందితుడు అవినాష్ రెడ్డి కర్నూలులో తన తల్లి ఆసుపత్రిలో ఉందని ఆడిన డ్రామాను ఎందుకు అడ్డుకోలేకపోయారు?
రాజకీయ క్రీడలో భాగంగా చంద్రబాబును అభాసుపాలు చేయడం న్యాయమా?. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం చంద్రబాబునాయుడును ఏమైనా అంటే ఊరుకునేది లేదన్న విషయం ఒకసారి ప్రజానీకం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు అరెస్టుతో సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నాయకులు, మంత్రులకు ప్రజలే త్వరలో సమాధానం చెబుతారు. అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్ ఎలా ఎదిగారో ప్రజలే ఆలోచించాలి.
వైసీపీ నాయకుల వెకిలి చేష్టలు, హేళన, లోప బుద్ధి, లోభిత్వం సరైందికాదు. ఏం తప్పు చేశారని చంద్రబాబునాయుడును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు? 14 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాలపాటు రాజకీయ యవనిక మీద ఏ మచ్చ లేని వ్యక్తి చంద్రబాబునాయుడు. కక్ష, పగ, ఈర్ష్య, ద్వేషంలో భాగంగానే ఆయనను అరెస్టు చేయించారు. ఏ సంబంధం లేని కేసులో ఆయనను అరెస్టు చేశారు.
కోర్టులను కూడా తప్పుదారి పట్టించారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కోర్టుకు సమర్పించారు. జగన్ ను అరెస్టు చేయడంలో పకడ్బందీగా వ్యవహరించారు. అధికారం ఉంది కదా అని చంద్రబాబును అంత ఇబ్బందులపాలు చేస్తారా? ప్రీ ప్లాన్డ్ గా చేశారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో ఓ మహిళా మంత్రి బాణాసంచ కాల్చి స్వీట్లు పంచారు. దీన్ని చూస్తుంటే చంద్రబాబునాయుడు అంటే ఆ మహిళా మంత్రికి ఎందుకంత పగ?
చంద్రబాబునాయుడు ఎంతోమంది యువతకు అమెరికాకు పంపి వారి జీవితాలలో వెలుగులు నింపారు. ఇదే స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా వేలాది మంది బిడ్డలను జీవితాల్లో సెటిల్ చేశారు. ఎంతో మంది రైతు బిడ్డల్ని, వారి కుటుంబాలను ఆదుకున్నారు. డీఐజీ రఘురామిరెడ్డి సీఐడీ ఛీఫ్ సంజయ్ లు జగన్ ఆడిన నాటకంలో పాత్రధారులు. భవిష్యత్తులో వీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జగన్ టీంకు ఒక న్యాయం? ప్రతిపక్షాలకు ఒక న్యాయమా?
చంద్రబాబునాయుడు వివాహ వార్షికోత్సవం రోజున ఆయన చేత కంటతడి పెట్టించడం అన్యాయం. హైదరాబాద్ లో లోటస్ పాండ్, బెంగుళూరు యలహంకలో 29 ఎకరాల్లో కట్టుకున్న ప్యాలెస్ ఎక్కడివి అవినీతి సొమ్ము కాదా? అమెరికా సంయుక్త రాష్ట్రాల లో శ్వేత సౌధాన్ని మించిన బంగ్లాలు మీరు ఇండియాలో కట్టారు. ఇదంతా అవినీతి సొమ్ము కాదా? ఈ రకంగా చంద్రబాబునాయుడును జైలుపాలు చేయడం సబబుకాదని.. కడిగిన ముత్యంలా మా నాయకుడు బయటికి వస్తారని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.