ఎంఐఎం కు దాసోహమయిండు
ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే.. సమైక్యత దినోత్సవం ఎలా అవుతుంది?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించిన కేసీఆర్… మరి నేడు ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదు?
సెప్టెంబరు 17 చరిత్రను కనుమరుగు చేసేలా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుట్ర
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
సెప్టెంబరు 17ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోనటువంటి ముఖ్యమైన రోజు. 1724 నుంచి సెప్టెంబరు 17 , 1948 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని అసబ్ జాహీలు, నిజాం పాలకులు పాలించారు. హైదరాబాద్ సంస్థానంలోని నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు జరిగాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసం కారణంగా సెప్టెంబరు 17న స్వాతంత్ర్యం లభించింది.
నాడు నిజాం ఆధీనంలో హైదరాబాద్ సంస్థానంలోని 16 జిల్లాలు ఉంటే.. వాటిలో నేటి తెలంగాణకు సంబంధించిన 8 జిల్లాలు.. 5 జిల్లాలు మహారాష్ట్రలో… కర్ణాటకలో 3 జిల్లాలను కలిశాయి.
నిజాం పూర్తిగా బ్రిటీషర్లకు సామంతరాజుగా వ్యవహరించిండు. తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం బ్రిటిషర్లతో ఒప్పందం కుదుర్చుకొన్నాడు. బ్రిటిషర్ల కనుసైగల్లో పనిచేశాడు. ఇతర దేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసి నిజాం రాజుకు అందించాడు.1911 నుంచి 1940 సెప్టెంబరు 17 వరకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన జరిగింది.
భారత స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్నపుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ .. హైదరాబాద్ సంస్థానం అంతా స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించి, ఆ ప్రాంతాన్ని ఇస్లామీకరణ చేసేందుకు పూనుకున్నాడు.
నాడు దేశమంతా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగితే.. హైదరాబాద్ సంస్థానంలో ఎటువంటి ఉద్యమం రాకుండా కుట్రలు చేశాడు. అనేక మంది హిందువులను ఇస్లాంలోకి మార్చాడు.
నాడు అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో నిజాం పాలన నుంచి తప్పించుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా బురుజులు నిర్మించుకున్నారు. తమన తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. కొందరు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు నిజాం హింసాత్మక చర్యలకు బలయ్యారు.
మా స్వగ్రామమైన కందుకూరు మండలం తిమ్మాపురం లో ఉన్న బురుజు సైతం నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులకు సజీవ సాక్ష్యం. నిజాం ఆధ్వర్యంలోని రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన జరిగింది.
1926లో హిందువులందరినీ ఇస్లామీకరణ చేయడం కోసం.. అనేక దేవాలయాలను, ఆచార వ్యవహారాలను, జీవన విధానాలను ధ్వంసం చేసేందుకు మజ్లిస్ ఇత్తే హాదల్ అనే సంస్థను స్థాపించాడు. 1948లో కరుడుకట్టిన ముస్లిం మతోన్మాది కాశీం రజ్వీ.. రజాకార్ల సంస్థను ప్రారంభించాడు. దానిలో ఎంఐఎం సభ్యులు భాగస్వామ్యమయ్యారు.
కరుడుగట్టిన ఖాశీం రజ్వీ నేతృత్వంలో మజ్లిస్ ఇత్తే హాదల్ సభ్యులు, రజాకార్లు హిందువులపై మారణహోమానికి పాల్పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కూలీలు, వృత్తిదారులతో వెట్టిచాకిరీ చేయించారు. పంటలను దోచుకున్నారు.
అనేక ప్రాంతాల్లో హత్యలు, మానభంగాలు, సామూహిక అత్యాచారాలు, దాడులు, బలవంతంగా మతమార్పిడులు చేయించి రాక్షసంగా వ్యవహరించారు. దీంతో అనేకమంది ప్రజలు దయనీయ పరిస్థితుల్లో మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాలకు పారిపోయారు.
రజాకార్లు.. పరకాల గ్రామంలో 19 మందికి పైగా ఊచకోతకు పాల్పడ్డారు. బైరాన్ పల్లిలో 120 మందిని అతి కిరాతకంగా చంపారు. ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడించి క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు.
15 ఆగస్టు 1947న భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చినా..560 పై పైచిలుకు సంస్థానాలు భారతదేశంలో విలీనానికి అంగీకరించినప్పటికీ .. హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం స్వతంత్రంగానే ఉంటుందంటూ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రకటించాడు. పాకిస్తాన్ కు డబ్బులు పంపి, పోర్చుగీసు, ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి ఆయుధాలు తెప్పించుకున్నారు.
హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలిపే కుట్రలూ జరిగాయి.13 నెలల వ్యవధిలోనే హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు 2 వేలకు మంది పైగా హిందువులను ఊచకోత కోసి హింసాత్మకంగా వ్యవహరించారు. నిజాం కాలంలో తెలంగాణ భాష, సంస్కృతి విధ్వంసానికి గురిచేశాడు. తెలుగు భాషను నిషేధించాడు.
నిజాం దుర్మార్గలకు చలింపోయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948లో పోలీస్ యాక్షన్ పేరుతో నిజాం పై యుద్ధం ప్రకటించారు. 1948, సెప్టెంబరు 13 న షోలాపూర్ నుంచి భారత సైన్యం కవాతు ప్రారంభించింది. ఆపరేషన్ పోలో ప్రారంభించి హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టారు. దీంతో సెప్టెంబరు 17న భారతసైన్యం చేతిలో చిత్తుగా ఓడి నిజాం లొంగిపోయాడు.
కానీ 1948 నుంచి 1998 వరకు కూడా తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందనే విషయాలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు చేసింది. ఖాశీం రజ్వీ పాకిస్తాన్ కు వెళ్లిపోతూ.. ఎంఐఎం సంస్థను ఓవైసీ కుటుంబానికి దారాదత్తం చేశాడు. సెప్టెంబరు 17 చరిత్రను కనుమరుగు చేసేలా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుట్రలు చేశారు.
1998లో అధ్వానీ గారి ఆధ్వర్యంలో నిజాం కాలేజీలో బిజెపి బహిరంగ సభను నిర్వహించి సెప్టెంబరు 17 హైదరాబాద్ విమోచన చరిత్రను వివరించాం. 1998 నుంచి భారతీయ జనతాపార్టీ అనేక పోరాటాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించుకున్నాం. అయితే, వేడుకలు నిర్వహించని కాంగ్రెస్ పార్టీ అనేక మంది బిజెపి కార్యకర్తలను అరెస్టులకు పాల్పడింది.
నేను శాసనసభలో సైతం అనేకమార్లు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మాట్లాడితే అంగీకరించలేదు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా జరపడం లేదు? ఎంఐఎం పార్టీకి లొంగిపోయి, తెలంగాణ అస్థిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని 2007లో నాటి అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించిన కేసీఆర్… మరి నేడు ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదు?
ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపుకునే అధికారం మాకు లేదా అంటూ రెచ్చగొట్టిన కేసీఆర్… నేడు ఎంఐఎం కు దాసోహమయిండు. కారు స్టీరింగ్, ఎక్సలేటర్, బ్రేక్ లను ఎంఐఎం చేతిలో పెట్టి వాళ్ల మోచేతి నీళ్లు తాగుతూ, ఆ పార్టీ కనుసైగల్లో పనిస్తున్నారు.
సెప్టెంబరు 17 చరిత్రను ఈ తరానికి అందించడంలో కాంగ్రెస్ కుట్ర చేస్తే.. నేడు కేసీఆర్ ఎంఐఎంకు లొంగిపోయి విమోచన దినోత్సవ చరిత్రను కనుమరుగు చేస్తున్నాడు. 75 సంవత్సరాల తర్వాత ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 17ను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాం. హోంమంత్రి అమిత్ షా గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అమృత్ ఉత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సంవత్సరం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం. భారతీయ జనతా పార్టీ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుంటే.. కేసీఆర్ ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. అందుకే సమైక్యత దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించాడు. కేసీఆర్..! వేలాదిమంది యువకులు, మహిళలు పెద్దఎత్తున పోరాటాలు చేసి నిజాంపై పోరాడితే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే.. సమైక్యత దినోత్సవం ఎలా అవుతుంది?
80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. సెప్బెంబరు 17 సమైక్యత దినమని ఏ పుస్తకం చెబుతుందో సమాధానం చెప్పాలి. హైదరాబాద్ స్వంతంత్ర్య పోరాటాన్ని, చరిత్రను పూర్తిగా తొక్కిపెట్టింది కాంగ్రెస్ పార్టీది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామ రాజు గారి 125 వ జయంతి ఉత్సవాలను నిర్వహించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే.
హైదరాబాద్ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే. హైదరాబాద్ ముక్తీ దివస్ పేరుతో కర్ణాటక, మహారాష్ట్రలో నిర్వహిస్తుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదు? కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలతో, మజ్లిస్ కు వంతపాడుతూ విమోచన దినోత్సవ చరిత్రను కాలరాస్తున్నారు. విమోచన దినోత్సవం నిర్వహించని మొదటి ద్రోహి కాంగ్రెస్.. రెండొవ ద్రోహి బీఆర్ఎస్.
విమోచన దినోత్సవాన్ని నిర్వహించేది లేదని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు స్వయంగా గతంలో అసెంబ్లీలో చెప్పారు ముస్లింలకు వ్యతికమంటూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు. నాడు నిజాం పాలనలో ముస్లింలపై అనేక అరాచకాలు జరిగాయి. అనేక మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.
కాచీగూడ ప్రాంతంలో రజాకార్ల దురాగతాలను ప్రజలకు తెలియజేస్తున్న షోయబుల్లా ఖాన్ అనే పత్రికా రచయితను రజాకార్లు చేతిని నరికి హత్య చేశారు. తుర్రేబాజ్ ఖాన్, అల్లావుద్దీన్ లాంటి వారిని చంపారు. అధికారమే పరమావధిగా మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ విమోచన దినోత్సవ చరిత్రను కనుమరుగు చేసేలా కుట్ర చేసి సమైక్యత దినోత్సవం అంటూ వల్లెవేస్తున్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే. నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన తుర్రేబాజ్ ఖాన్, అల్లావుద్దీన్, సర్దార్ పాపన్న గౌడ్, షోయబుల్లా ఖాన్, వందేమాతరం రాంచందర్ రావు, మొగిలయ్య గౌడ్, కొమురం భీం, దొడ్డి కొంరయ్య, చాకలి ఐలమ్మ, కాండా లక్ష్మణ్ బాపూజీ లాంటి సమరయోధులు నాటి చరిత్రకు సాక్ష్యం.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించడమే కాకుండా నాటి స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించుకునేలా కార్యక్రమాలు చేపడుతాం. రజకార్ల పీడ విరగడైన రోజు, తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు.. సెప్టెంబరు 17. అందుకే, హైదరాబాద్ విమోచన దినోత్సవాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకుందాం.
మన పూర్వీకులు చేసిన త్యాగాలను స్మరించుకునేలా జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను నిర్వహించుకుందాం.సెప్టెంబర్ 17 ను హైదరాబాద్ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 1998నుంచి పోరాటం చేశాం.విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా.. తెలంగాణలోని అందరు సర్పంచ్ లకు లేఖలు రాస్తున్నాను.
రాష్ట్రపతి నిలయానికి హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు అవినాభావ సంబంధం ఉంది. సెప్టెంబరు 17కు రాష్ట్రపతి భవన్ సజీవ సాక్ష్యం.భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సెప్టెంబర్ 17 విమోచన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరవుతోన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పాల్గొంటారు.
మూర్ఖత్వంతో తమకు గ్రౌండ్ ఇవ్వలేదని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ విషయంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాలను నిర్వహించుకోవాలని నిర్ణయిస్తే.. దాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి.
విమోచన ఉత్సవాలు బిజెపి పార్టీ కార్యక్రమం కాదని గుర్తుంచుకోవాలి.తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నాం. ఓవైసీ అనుమతి ఉంటేనే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17కార్యక్రమానికి హాజరవుతారు. సమైక్యత దినోత్సవం కాదు.. విమోచన దినోత్సవాన్ని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.