-17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో అదనంగా అందుబాటులోకి వచ్చే సీట్లు 2,550
-ఈ నాలుగేళ్లలో వైద్య, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం- సీఎం
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం జగన్ ప్రారంభించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని తన చేతుల మీదుగా ప్రారంభించిన సీఎం.. అనంతరం వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అంతేకాకుండా విజయనగరం మెడికల్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కాలేజీ భవనంలోని వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించి ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.
మన ప్రభుత్వం 17 మెడకల్ కాలేజీల కోసం రూ. 8,480 కోట్లు వెచ్చిస్తుంది
స్వాతంత్య్రం వచ్చాక మన ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, ఈ నాలుగేళ్లలో మన ప్రభుత్వం 17 మెడకల్ కాలేజీలు ప్రారంభించేందుకు ప్రణాళిక చేశామని, అందుకోసం రూ. 8,480 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఐదు కాలేజీలు ప్రారంభించటం సంతోషంగా ఉందని, వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను ప్రారంభిస్తామని, ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్ంగోల ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నది తన అభిలాష అని అందుకు అనుగుణంగా పని చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఉన్న మెడికల్ కాలేజీలలో 2,185 సిట్లు ఉన్నాయని, కొత్త కాలేజీల రాకతో 4,735కి సీట్ల సంఖ్య చేరిందని సీఎం తెలిపారు. అంతేకాకుండా మలో18 నర్సింగ్ కాలేజీలను కూడా అందుబాటుకి తీసుకువస్తున్నట్లు సీఎం వెల్లడించారు. అంతేకాకుండా ఈ కాలేజీల ద్వారా పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచామని తెలిపారు. మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరిచేందుకే పని చేస్తున్నామని ప్రతి విద్యార్ధి ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకుని ఈ సమాజంలో ఒక మంచి డాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుని సేవ చేయాలనే తన ఆకాంక్షను తెలిపారు.
ఈ నాలుగేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మకమార్పులు తీసుకువచ్చాం
నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ చేశామని సీఎం పేర్కొన్నారు. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నామని ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు చేసినట్లు సీఎం చెప్పారు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు చేశామని, 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్న ప్రభుత్వం మనదే అని అన్నారు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు వెళ్తారని దీని ద్వారా రానున్న 6 నెలల్లో పేదలకు మంచి వైద్యం అందించి ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మారతామని అన్నారు.
గ్రామస్థాయిలో ఆశా వర్కర్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నమని, టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం చేశాని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంచామన్నారు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వెచ్చించామని చెప్పారు. తాజాగా ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి పేద వాడికి రూ.1 ఖర్చు లేకుండా పరీక్షలు చేసి చికిత్స అందిస్తామని తెలిపారు. గతంలో జగనన్న సురక్ష ద్వారా 93 లక్షల డాక్యుమెంట్స్ ఇచ్చామని పేదల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని అన్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లిస్తున్నామని, ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు ప్రభుత్వం అందించిందని అన్నారు. 108, 104 వాహనాలు సంఖ్యను కూడా పెంచినట్లు వెల్లడించారు.