Suryaa.co.in

Andhra Pradesh

స్కిల్‌ స్కాంలో పవన్‌ కల్యాణ్‌ కూడా భాగస్వామే

– చంద్రబాబు కొట్టేసిన రూ.371 కోట్లలో నీవాటా ఎంత?
– యుద్ధం మొదలైంది… ఇక మీ పతనమే మిగిలింది.
– జగన్‌ పై యుద్ధమంటే 5 కోట్ల మంది ప్రజలపై యుద్ధమే!
– ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్ళావ్ లోకేష్..!
– ఢిల్లీ వెళ్లి మీ నాన్న రూ.371 కోట్లు కొట్టేశాడు అని చెప్తావా?
– ఇంతకాలం స్టేలతో బతికిన చంద్రబాబు పాపం పండింది
– ఒకవైపు బీజేపీతో సంసారం.. మరోవైపు టీడీపీతో తాళి
– క్షణాల్లో బంధాలు, పార్టీలు ఎలా మారిపోతాయ్?
– బాబు-పవన్ లది ప్యాకేజీ ఫెవికాల్‌ బంధం
– ఇద్దరు మెంటల్ కేసుల మధ్య పిచ్చి పవన్‌ కళ్యాణ్‌
-: మంత్రి  జోగి రమేశ్‌

రెండు మెంటల్‌ కేసుల మధ్య పిచ్చి పవన్‌ కళ్యాణ్‌:
– నిన్న రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ వద్ద ముగ్గురు మెంటల్ వాళ్ళు ఒక చోట చేరినట్టు ఉంది. ఇద్దరు మెంటల్‌ కేసుల మధ్యలో ఒక పిచ్చి పవన్ కల్యాణ్‌ను చూశాం.
– పవన్‌ కల్యాణ్‌ సినిమా తీయదలచుకుంటే ఇద్దరు మెంటల్‌ కేసుల నడుమ పీకే.. అని టైటిల్‌ పెట్టాలి.
– దానికి బొక్కలో బాబు 7691 అనే ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చి బ్రహ్మాండమైన సినిమా తీయవచ్చు.
– ఒక పక్క అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్‌ అయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నాడు.
– పరామర్శకు వెళ్లిన ఒక పార్టీ అధ్యక్షుడు ఏం చేయాలి..? చేసింది ఏంటి..?
– బాబు పరామర్శకు వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఆయన మంచి చెడులు,యోగక్షేమాలు కనుక్కోవాలి.
– చంద్రబాబు గారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాలి.
– మీరు చన్నీళ్ల స్నానం చేస్తున్నారట కదా…మొన్న మీ ఆవిడ చెప్పింది అని అడగాలి.
– బయటకు వచ్చాక మీడియా వాళ్లు అడిగితే ఆయన యోగక్షేమాల గురించి చెప్పాలి.
– కానీ లోపలికి వెళ్లి బాబుతో పొత్తులు- ప్యాకేజీలు మాట్లాడుకుని వచ్చాడు.
– బయటకు వచ్చి టీడీపీకి నేనున్నాను అంటూ పొత్తు ప్రకటించాడు.
– బీజేపీతో ఒక పక్కన సంసారం చేస్తూనే..మరోవైపు టీడీపీతో తాళికట్టించుకున్నాడు.
– క్షణాల్లో బంధాలు, పార్టీలు మారిపోతాయా పవన్ కల్యాణ్? ఎవరన్నా నీ మీద ఉమ్ము వేస్తారు అన్న సిగ్గు కొంచెం కూడా లేదా?

జగన్‌ పై యుద్ధం అంటే ఐదు కోట్ల ప్రజలపై యుద్ధమే!:
– బయటకు వచ్చి యుద్ధం చేస్తాను అంటున్నాడు..ఏమి యుద్ధం చేస్తావ్‌..ఎవరి మీద యుద్ధం చేస్తావ్‌..?
– ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ గారిపై యుద్ధం చేయడమంటే ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల మీద యుద్ధం చేయడమే.
– అమ్మ ఒడి ద్వారా చదువుకుంటున్న 90 లక్షల మంది పిల్లలు, 45 లక్షల మంది వారి తల్లులతో యుద్ధం చేస్తావా?
– వైఎస్సార్‌ ఆసరా తీసుకుంటున్న కోటి మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలపై యుద్ధం చేయడమే.
– వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ధిపొందుతున్న 28 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలపై యుద్ధం చేయడమే.
– వైఎస్సార్‌ పింఛన్‌ కానుక తీసుకుంటున్న 66 లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులపై యుద్ధం చేయడమే.
– యుద్ధానికి రెడీ అంటున్నావ్‌…ఇదేమీ సినిమా కాదు పవన్‌ కల్యాణ్‌.
– నువ్వు సినిమాల్లో హీరోవి…రాజకీయాల్లో జీరోవి.

స్కిల్ స్కాంలో పవన్‌ కల్యాణ్‌ కూడా భాగస్వామే!:
– చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాతే కదా స్కిల్‌ స్కాం జరిగింది..
– చంద్రబాబు కొట్టేసిన రూ.371 కోట్లలో నువ్వెంత తీసుకున్నావ్‌ పవన్‌..?
– ఇది కూడా బయటకు రావాలి. నీకు కూడా దాంట్లో పాత్ర ఉంది.
– చంద్రబాబు గెలవడానికి నువ్వు సహకరించినప్పుడు నీకు కూడా బాధ్యత ఉంది.
– రూ.371 కోట్లు అప్పనంగా చంద్రబాబు కొట్టేస్తే, నీవు భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వంలో నీకు వాటా లేదంటే రాష్ట్ర ప్రజలు నమ్మాలా? నువ్వు ఆ అవినీతిలో భాగస్వామివి కాదా..?
– మీరు ఇప్పటివరకూ కలిసి లేరా? మీరేమన్నా విడివిడిగా ఉన్నారా? మీది ప్యాకేజీ ఫెవికాల్‌ బంధం అని ప్రజలకు తెలియదా?
– జైలు లోపలికి వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చి కొత్తగా పొత్తు ప్రకటించినట్లు డ్రామాలెందుకు?

ఢిల్లీ వెళ్లి మీ నాన్న రూ.371 కోట్లు కొట్టేశాడు అని చెప్తావా?:
– గజదొంగేమో లోపలున్నాడు..పిల్ల దొంగ ఢిల్లీ వెళ్లాడు.
– ఢిల్లీ వెళ్లి ఏం చెబుతావ్‌ లోకేశ్‌..మీ నాన్న స్కిల్‌ స్కాంలో రూ. 371 కోట్లు నొక్కేశాడు అని చెప్తావా?
– మీ నాన్న అవినీతి చరిత్ర ఏపీ వరకే తెలిసింది..ఇప్పుడు నువ్వెళ్లి మీ నాన్న నిజస్వరూపాన్ని జాతీయ మీడియా ముందు ప్రెజెంటేషన్‌ ఇస్తావా?
– ఢిల్లీ నుంచి లాయర్లను స్పెషల్‌ ఫ్లైట్‌లో పిలిపించుకున్నారు అంటే మీ దగ్గర ఎంత అవినీతి సొమ్ము ఉందో అర్ధం కావాడం లేదా?
– మీ పాపం పండింది కాబట్టి ఏ రోజుకైనా బాబు బొక్కలోకి వెళ్తాడు అని ప్రజలు భావించారు.
– ఇప్పటి వరకూ స్టేలతోనే కదా మీరు బతికారు? ఈ రోజుకైనా మీ పాపం పండింది.
– మీ అవినీతి నిజస్వరూపం బట్టబయలైంది కాబట్టి ఎంత మంది వచ్చి వాదించిన బాబు బొక్కలోకి వెళ్లిపోయాడు.
– ఢిల్లీలో వాళ్ళ కాళ్ళూ, వీళ్ళ కాళ్ళూ పట్టుకుని, మా నాన్న అడ్డంగా దొరికాడు..మా నాన్నను కాపాడండి అని అడుగుతావా?
– ఓ పక్క జాతీయ మీడియాని కలుస్తాను అంటాడు..మరో పక్క పెద్దల కాళ్లు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.
– చివరికి కలిసింది… ఒక బ్రోకర్‌ విగ్గు గాడ్ని.

యుద్ధం అల్‌ రెడీ మొదలైంది..ఇక మీ పతనమే మిగిలింది:
– మీరు ఎన్ని బుల్డోజర్లు పెట్టి లేపినా మీ అవినీతి చరిత్ర, పవన్‌ ప్యాకేజీ చరిత్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు.
– ఇప్పటికైనా జగన్‌ గారిని చూసి నేర్చుకోండి. దమ్మున్న లీడర్‌ అంటే జగన్‌ గారు.
– యుద్ధం అల్‌ రెడీ మొదలైంది…మీ పతనం ఆరంభం అయ్యింది..అంతం కూడా కాబోతుంది.
– 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌..ఇంకా ఎవరు కలిసి వచ్చినా మీ ఓటమి ఖాయం.
– ప్రజలు టీడీపీ, జనసేనలను గోదావరి, కృష్ణా నదుల్లో ముంచేస్తారు.
– ఆంధ్రప్రదేశ్‌ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో పెడతానన్న చంద్రబాబు స్కిల్డ్ గా అవినీతి చేయడంలో ఈ దేశానికి చూపించాడు.
– ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని జగన్‌ గారు దేశానికి చూపించారు.
– మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వం జగన్‌ గారివైపు చూస్తున్నారు.
– మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రతిఒక్కరూ జగన్‌ గారిలా పరిపాలన చేయాలని కోరుకుంటున్నారు.
– పరిపాలన ఎలా చేయాలో.. జగన్‌ గారిని చూసి నేర్చుకోండి.
– మీరు ఎంత మీసాలు మెలేసిన, తొడలు కొట్టినా 2024లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెట్టబోతున్నారు. రాసిపెట్టుకోండి.

LEAVE A RESPONSE