Suryaa.co.in

Andhra Pradesh

తెలంగాణలో లేని ఆంక్షలు ఎపిలోనే ఎందుకు?

– శాంతియుత నిరసనలపై కేసులు బ్రిటీష్ కాలంలో కూడా లేవు!
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

బ్రిటీష్ పాలనను మించిన స్థాయిలో రాష్ట్రంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై ప్రభుత్వ అక్రమ కేసులు, నిర్భంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా చేస్తున్న నిరాహారదీక్ష లు, కొవ్వొత్తుల ర్యాలీలపైనా హత్యాయత్నం కేసులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. టీడీపీ అధినేతకు సంఘీభావంగా సముద్ర తీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన వారిపైనా కేసు పెట్టడం లాంటి చర్య దేశంలో మరెక్కడా జరిగి ఉండదు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం తీరు చూస్తుంటే సముద్ర గర్భంలో, అంతరిక్షంలో, భూగర్భంలో కూడా 144 సెక్షన్ ఉంది, 30 పోలీస్ యాక్ట్ ఉంది అనేలా ఉన్నారు.

శాంతియుత నిరసనలూ జరగడానికి వీల్లేదని సిఎం రివ్యూ చేసి మరీ డీజీపీకి అదేశాలు ఎందుకు ఇచ్చారు? ప్రజా స్వామ్యంలో ప్రజలు తమ నిరసనలు తెలిపే హక్కును కాదని చెప్పే హక్కు మీకెక్కడిది? పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై లేని నిషేధం ఎపిలోనే ఎందుకు? పక్కన ఉన్న తెలంగాణ లో లేని నిర్బంధాలు మన రాష్ట్రంలో ఎందుకో సైకో సర్కార్ సమాధానం చెప్పగలదా? ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని….ఈ ప్రభుత్వం తుప్పు పట్టిన అక్రమ కేసుల విధానంతో ఇక అడ్డుకోలేదు.

LEAVE A RESPONSE