చంద్రబాబు ఆరోగ్యంపై కేటీఆర్ రియాక్షన్
చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘లోకేశ్ ట్వీట్ చూసి బాధ అనిపించింది. చంద్రబాబుకు ప్రాణాపాయం ఉన్నట్లు ఆయన భావిస్తున్నారు. అదే నిజమైతే దురదృష్టకరం. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నాం’ అని పేర్కొన్నారు.