నేడు భారీ వృక్షాలై గౌడన్నలకు కల్లు నిస్తూ ఉపాధిని కల్పిస్తున్నాయి
ఆనందపడ్డ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో 2017 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యుని హోదాలో బోయినపల్లి వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతో గిరక తాటి చెట్లను నాటారు. అవి పెరిగి పెద్దవైనవి. గౌడన్నలు తాళ్ళను గీసి కళ్ళు అమ్ముతు ఉపాధి పొందుతున్నారు.
గురువారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొనరావుపేట మండలంలో పర్యటించిన బోయినపల్లి వినోద్ కుమార్ తాను 2017లో సుద్దాల గ్రామంలో నాటిన గిరిక తాళ్ళను గుర్తుకు చేసుకుని తాళ్ళ వద్దకు వెళ్ళి గౌడన్నలతో మాట్లాడారు.ఈ సందర్భంగా గౌడన్నలు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తాను నాటిన గిరిక తాళ్ళ ద్వారా గౌడన్నలు ఉపాధి పొందడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు దేవలక్ష్మి శంకర్, శ్రీనివాస్, సంతోష్ ,రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, బీ ఆర్ ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు, యాదవ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నాగరాజు యాదవ్, సాయి కృష్ణా, తదితరులు పాల్గొన్నారు.