Suryaa.co.in

Telangana

దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న పోరాటం

మోదీ, కేసీఆర్ ఇద్దరూ ప్రజలను మోసం చేశారు
బీజేపీ, ఎంఐఎం కు ఓటు వేస్తే అవి బీఆరెస్ కు వేసినట్టే
లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు
ఓబీసీ గురించి మాట్లాడే ప్రధాని ఎందుకు కులగణన చేపట్టడం లేదు
రాహుల్ గాంధీ

పెద్దపల్లి : తెలంగాణతో నాకున్నది రాజకీయ అనుబంధం కాదు.తెలంగాణతో నాది కుటుంబ అనుబంధం. నెహ్రూ, ఇందిరమ్మ నుంచి ఈ బంధం కొనసాగుతోంది.రాజకీయంగా కాంగ్రెస్ కు నష్టమని తెలిసినా సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పదేళ్లయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.

ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న పోరాటం. కేసీఆర్ తనకు తాను తెలంగాణకు రాజుగా భావిస్తున్నారు. బీఆరెస్ పాలనలో పేదల భూములు గుంజుకున్నారు. ధరణి పేరుతో మీ భూములను కేసీఆర్ లాక్కున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని కేసీఆర్ ప్రజలను మోసం చేశారు.కేసీఆర్ పాలనలో బడా కాంట్రాక్టర్లకు లాభం జరిగింది తప్ప .. పేదలకు ఒరిగిందేం లేదు.

సింగరేణి మైన్స్ ప్రయివేటు పరం చేస్తున్నారు. గతంలో సింగరేణి మైన్స్ ను కేసీఆర్ ఆదానీకి అమ్మాలని చూశారు. దేశ సంపదను మోదీ ఆదానీకి దోచిపెడుతున్నారు.మోదీ, కేసీఆర్ ఇద్దరూ ప్రజలను మోసం చేశారు.కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంది. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేసాం. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతాం.

మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ నార్ల మహిళలకు రూ.2500 అందిస్తాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాంభూమి లేని రైతు కూలీలకు 12వేలు, రైతులకు, కౌలు రైతులకు 15వేలు అందిస్తాం గృహలక్ష్మీ ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేస్తాం.

కేసీఆర్ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతుంది.బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎం కు ఓటు వేస్తే అవి బీఆరెస్ కు వేసినట్టే. బీజేపీ పై పోరాడినందుకు నాపై కేసులు పెట్టారు.. నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు. కానీ లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు.. సీబీఐ, ఈడీ కేసులు లేవు.

ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆరెస్ ను ఓడించాలి. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోంది.తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.దేశంలో కులగణన చేపట్టాలి.. అది దేశానికి ఎక్స్ రే లాంటిది. ఓబీసీ గురించి మాట్లాడే ప్రధాని ఎందుకు కులగణన చేపట్టడం లేదు?

LEAVE A RESPONSE