-కేసీఆర్ ని ఎదుర్కోలేక తెరవెనుక కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
– నియోజకవర్గాలు పంచుకుని మరి కేసీఆర్ పై పోటీ
– తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధం మరోసారి బయటపడింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని కొద్ది రోజుల క్రితమే యెన్నం శ్రీనివాసరెడ్డి అనే నాయకుడు చెప్పాడు. దీనికి బలం చేకూరుస్తూ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తున్నాయి. ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో రెండు పార్టీలు కలిసి రాజకీయ కుట్రలతో ఎన్నికల్లో వెళ్తున్నాయి.
కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలను ఇద్దరు పంచుకున్నారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గజ్వేల్ నుంచి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
రేవంత్ రెడ్డికి దమ్ముంటే గజ్వేల్ నియోజకవర్గం నుంచి మాత్రమే బరిలోకి దిగాలి. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటిస్తే ఆయనపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండు నియోజకవర్గాల నుంచి ఎలా పోటీ చేస్తారు? నిజంగానే రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, రేవంత్ రెడ్డి మగాడైతే గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేయాలి.
లేదంటే ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కామారెడ్డి నుంచే పోటీ చేయాలి. రెండు పార్టీల నేతలు కేసీఆర్ గారిపై ఒకే దగ్గర పోటీచేయాలి. అప్పుడు ఎవరి ప్రజాబలం ఏంటో తెలుస్తుంది.
కేసీఆర్ గారి మీద పోటీ అంటే పోలేరమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే అని అందరికీ తెలుసు. అందుకే మీ షబ్బీర్ అలీ కూడా పోటీ నుంచి పారిపోయారు. కానీ బీజేపీతో ఉన్న ఒప్పందం కోసం, వారి ఆజ్ఞలను శిరసావహించాలి కాబట్టి రేవంత్ రెడ్డి గజ్వేల్ లో కాకుండా కామారెడ్డిలో పోటీకి సిద్ధపడ్డారు.
కేసీఆర్ మగాడు కాబట్టే సిట్టింగ్ లకే టికెట్లు ఇచ్చారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా టికెట్లు ప్రకటించడమే కాదు.. బీఫాంలు కూడా అందజేశారు. కానీ ఒక్కో టికెట్ కు కోట్ల రూపాయల చొప్పున వసూలు చేస్తున్న బ్రోకర్ వి నువ్వు. కర్ణాటక నుంచి అక్రమ సొమ్ము తీసుకువచ్చి తెలంగాణలో ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న అవినీతిపరుడివి. ఎక్కడ పోటీ చేసినా నిన్ను ప్రజలు తరిమి తరిమి కొడతారు. పరాకాష్టకు చేరిన నీ అవినీతితో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీకు డిపాజిట్లు రాకుండా చేస్తారు.