– మీ అవినీతికి దర్పాలే కాళేశ్వరం లోపాలు
– మీ మానస పుత్రిక కాళేశ్వరం అంతా బోగస్
– వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
దొర గారి కమీషన్ల కక్కుర్తికి పంప్ హౌజ్ లే కాదు.ఏకంగా బరాజ్ లే కుంగుతున్నయ్. ప్రాజెక్ట్ కట్టిన నాలుగేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కదిలిందంటే.. మీ మెగా లోపమేంటో,మెగా దోపిడేంటో మరోసారి తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నాసిరకం అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం మరోటి లేదు.లక్ష కోట్ల ప్రజా ధనాన్ని కాజేశారనడానికి మేడిగడ్డ కుంగడమే ఒక నిదర్శనం. మీ అవినీతికి దర్పాలే కాళేశ్వరం లోపాలు.తప్పులు కప్పి పుచ్చడానికి కుట్ర కోణం అని డ్రామాలు మొదలు పెట్టినా, ప్రాజెక్ట్ చుట్టూ పోలీసులను పెట్టి నిజాలు దాచిపెట్టినా, జరిగిన నష్టాన్ని బయటకు పొక్కకుండా నోర్లు మూయించినా, మీ మానస పుత్రిక కాళేశ్వరం అంతా బోగస్ అని ఆధారాలతో తెలంగాణ సమాజానికి అర్థమైంది. “లక్ష కోట్ల కాళేశ్వరం నీళ్ళు గోదారి పాలు – నిధులు కల్వకుంట్ల వారి పాలు”