( శ్రీనివాస చక్రవర్తి)
రెడ్డి రాజ్య ఆఖరి పరిపాలకుడైన రాచ వేమారెడ్డి అస్తవ్యస్త పాలన వల్ల, అతడికి కపిలేంద్ర గజపతులను (వడ్డి/వడ్డెర రాజులు) ఎదుర్కోవటం సాధ్యం కాలేదు. పైగా కనీ వినీ ఎరుగని సుంకాలతో ప్రజా కంటకుడిగా పేరు పొందాడు.
సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుని భార్య ప్రసవించింది. రాజ భటులు పురిటి పన్ను కట్టమని వేధించారు. ఆ సంగతి తెలిసి, ఎల్లయ్య కోపంతో మండిపడ్డాడు. కోటలోకి వెళ్లి ముత్యాలమ్మ గుడి సమీపంలో రాచవేమారెడ్డిని పొడిచి చంపివేశాడు అని మెకంజీ కైఫేయతు తెలుపుతోంది.
ఈ విధంగా ఆంధ్రదేశ చరిత్రలో 100 సంవత్సరాలు పాలన చేసిన రెడ్డి వంశ పాలన, 1424వ సంవత్సరంలో అంతం అయ్యింది.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెడ్లు రాజకీయంగా బాగా బలపడ్డారు. అలా తమ అధికారం అడ్డంపెట్టుకుని అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయించారు. వారికి రాజకీయంగా ఎదురే లేకుండా పోయింది. అలాంటి సమయంలో NTR తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయటం కుల, మత, ప్రాంతీయ బేధం లేకుండా అన్ని వర్గాలు మద్దతివ్వటంతో కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా రెడ్ల ఆధిపత్యం తుడిచిపెట్టుకు పోయింది.
రాజ్యాధికారానికి దూరంగా ఉన్న రెడ్లకు, ఈ పరిణామాలు ఎంత మాత్రం రుచించలేదు. ముఖ్యంగా కాపులు అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాపులు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియచేయటం, వారికి ఎంత మాత్రం రుచించలేదు. కమ్మ, కాపు ఐక్యత బలపడితే తమ అధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందని భావించారు.
అనుకోకుండా వారికి వంగవీటి రంగా రూపంలో మరో బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ఆ తర్వాత అతన్ని పావుగా చేసుకుని, అతని మరణంతో కూడా రాజకీయంగా రెడ్లే లబ్దిపొందారు. విజయవాడలో రెండు కుటుంబాల వైరాన్ని, తమకు అనుకూలంగా మలచుకోవడంలో రాజశేఖర రెడ్డి సఫలమయ్యాడు.
అప్పటి వరకు కుల పరంగా కమ్మ, కాపుల మధ్య విబేధాలు లేవు, రంగా భార్య, అతని వ్యక్తిగత లాయర్, ముఖ్య అనుచరులు కూడా కమ్మవారే.
అటువంటి తరుణంలో కమ్మ, కాపుల మధ్య దేవినేని మురళి హత్యానంతరం ఏర్పడ్డ పరిణామాల్లో.. తెలుగుదేశం పార్టీకి, కమ్మ వారికి వ్యతిరేకంగా రంగాను, కొంత మంది కాపు కులపెద్దలను ఎగదోసిన రాజశేఖరరెడ్డి .. ఆ తరువాత “కాపునాడు” సభ విజయవంతం అవ్వటం, ఆ సభ ద్వారా కాపులు, తెలగ, బలిజలు ఏకమవ్వటం వంటి పరిణామాలు రెడ్డి వర్గం వారికి ఆందోళన కలిగించాయి.
కాపు, బలిజ ఐక్యత, రంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆ వర్గాలు చేస్తున్న ప్రచారం, వారికి వెన్నులో వణుకు కలిగించింది. అదే సమయంలో పిసిసి అధ్యక్షుడిగా రంగా పేరు ప్రస్తావనకు రావటం, రంగాను ముందు పెట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎదుర్కుందామని, కాంగ్రెస్ లో అధిష్టానానికి దగ్గరగా ఉండే కాపు పెద్దలు హనుమంతరావు, శివశంకర్ లాంటి వారు ప్రతిపాదించడం.. వారికి కమ్మ వారైన NG రంగా కూడా మద్దతివ్వటం వంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం వారిని కలవరపాటుకు గురిచేశాయి.
రాయలసీమలో సంఖ్యాపరంగా అధికంగా ఉన్న బలిజలు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉన్న కాపులు ఏకమైతే.. తమకు భవిష్యత్తులో రాజకీయంగా, సామాజికంగా ముప్పు తప్పదని భావించి అతన్ని నిర్మూలించి కాపు ఉద్యమాన్ని అణచివేయాలని, రాజశేఖరరెడ్డి ప్రణాళిక రచించాడు.
తదనుగుణంగా పావులు కదిపి, రంగాను నిరాయుధుడిగా ఆమరణ దీక్షకు ఉసిగొల్పి, రంగాకు శత్రువు దేవినేని నెహ్రును అడ్డం పెట్టుకొని.. రాయలసీమ గూండాలను పంపి బాంబులు వేయించి రంగాను హత్య చేయించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు బాంబుల సంస్కృతి లేని విజయవాడలో మొదటి, చివరి సారిగా రాజశేఖర రెడ్డి నేతృత్వంలో రంగాను దారుణంగా బాంబులు వేసి నరికి చంపి, ఆ హత్యను తెలుగుదేశం పార్టీ, కమ్మ వారికి పులిమి, రంగా హత్యానంతరం మారణకాండ సృష్టించి కమ్మ, కాపు కులాల మధ్య పూడ్చలేని అఖాతం సృష్టించడంలో రాజశేఖర రెడ్డి సఫలీకృతుడయ్యాడు.
అలా కోస్తాంద్ర జిల్లాల్లో రెండు బలమైన కులాల మధ్య చిచ్చు రగిలించి రాజశేఖర రెడ్డి, ఆయన వర్గం చలికాచుకున్నారు. రంగా హత్యకు రాజశేఖరరెడ్డికి సహకరించిన దేవినేని నెహ్రూ, వసంత నాగేశ్వరరావు.. రాజశేఖరెడ్డి పంచన చేరటం, తరువాత కాలంలో దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్, వసంత నాగేశవరరావు కొడుకు వసంత కృష్ణప్రసాద్ జగన్ పంచన చేరటం లాంటి పరిణామాలు గ్రహిస్తే.. బలిజ/కాపుల పట్ల రాజశేఖర రెడ్డి, జగన్ నైజం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది.
రెడ్డి రాజ్య వంశం పతనం బలిజ వారితోనే జరిగింది. మళ్ళీ వాళ్ళు బలపడితే భవిష్యత్తులో తమ ఆధిపత్యానికి సవాలుగా మారతారని భావించి, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ కళ్యాణ్ ను, కాపు, బలిజ ఐక్యతను దెబ్బతీయటానికి అదే వర్గంలో కొందరిని అధికారం, డబ్బులతో లోబరచుకుని వారిని అదే కాపులు, పవన్ కళ్యాణ్ పై అస్త్రంగా ప్రయోగించాడు.
వంగవీటి రంగా కుమారుడు, రంగాతో సాన్నిహిత్యం ఉన్నవారు నిదానంగా వాస్తవాలు గ్రహించి పాత వైరాన్ని మరచి కమ్మవారితో ఐక్యత కోరుకోవటం జగన్ రెడ్డికి ఎంతమాత్రం రుచించటం లేదు.
జనసేన- తెదేపా పొత్తుతో భవిష్యత్తులో బలిజ వర్గం వారు రాజకీయంగా రాయలసీమ జిల్లాల్లో తమ ప్రాబల్యం తగ్గిపోతుందనే ఆందోళనలో ఉన్న జగన్ రెడ్డి వర్గం , మరిన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తుంది. వివేకవంతులైన కాపు, కమ్మ వర్గాలు, బీసీ, ఎస్సీ లను కలుపుకొని.. జగన్ రెడ్డి అరాచకవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది.