Suryaa.co.in

Political News

అంతా మీరే చేశారు ..!

అమరావతి ని ఆగమాగం చేసారు..!పోలవరానికి బ్రేకులేశారు. ..అభివృద్ధి ని ఆపేశారు.

పిలిచి పెద్దపీట వేసి గౌరవించి ఆదరించి అగ్రతాంబూలం ఇస్తే..విస్తట్లో ఉమ్మారు.
ఈర్ష్య అసూయలతో రగిలి పోయారు.

అమరావతి సమస్య భూములిచ్చిన రైతుల దే కాదు.
ఆంధ్రులందరిదీ! నమ్మారు..పెద్ద మనిషి వని.
ఆప్ హమ్ కో ధోకా దియా ! సాబ్!

అరాచకానికి అండగా నిలిచారు..!
ప్రజల్ని పీడించేవారికి వత్తాసు పలికారు..!
వ్యవస్ధల్ని చెరబట్టి నిర్వీర్యం చేశారు..!

మీ ఆటలు సాగటం లేదు..!
గ్రేట్ ఇండియన్ పొలిటికల్ లెంజెండ్ చంద్రబాబునాయుడు గారిని అక్రమంగా..నిర్భందించారు..!
ఆధారాలు లేని ఆరోపణలు..!
కక్ష సాధింపు..మానసిక హింస..!
ఆరోగ్యం మీద దాడి..!

మొత్తం తెలుగు జాతి గుండె రోదిస్తున్నది..!
ప్రాంతాలు..కులాలు..మతాలు అతీతంగా ఆవేదన వ్యక్తమవుతున్నది.
ఇది అన్యాయం అని ఘోషిస్తున్నది.

ఆంధ్రుల రోదన రోషంగా మారుతుంది..ఆందోళన ఆవేశంగా మారుతుంది.
ఆంధ్రలో మొదలయిన దావానలం దేశాన్ని చుట్టుముడుతుంది.
మీరు ఇక ఎప్పటికీ తెలుగువారి మనసు గెలుచుకోలేరు.

ఆంధ్రావాడు..తెలుగువాడు ఇందిరాగాంధీ ని దేశమంతా ఓడించినా ..గెలిపించాడు.
దారి తప్పితే కాంగ్రెస్ ని దేశమంతా గెలిపించినా ఇక్కడ ఓడించాడు.

అసలు ఏకఛత్రాధిపత్య కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం సృష్టించాడు.
వైసీపి..టీఆరెస్..వీళ్ళను అడ్డం పెట్టుకుని డ్రామాలాడనివ్వరాదు.
అసలు జాతీయ పార్టీలను సోదిలోకి తీసుకోరాదు.

కళ్ళ ముందు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కల్పించుకోని..తెలుగువాళ్ళు కూడా ఈ దేశ పౌరులేనని గుర్తించని పార్టీలను వెలేద్దాము.
ఇప్పటికే ఆంధ్రాలో జీరో కి చేరారు..అసలు వారి ఉనికి ని కూడా గుర్తించవద్దు.

భారత రాజ్యాంగాన్ని అమలు చెయ్యమని అడుక్కునే పరిస్ధితి..!
చట్టాన్ని తన పని తనని చేసుకోనివ్వమని బతిమలాడాలి.
హక్కులు కాపాడమని వేడుకోవాలి..!
దేనికి స్పందించరు..!

మాకు ఓట్లు వెయ్యాలని..మాట్లాడుతున్నారు.
శవాల దగ్గర డబ్బులేరుకునే తంతు.
ఇల్లు కాలుతుంటే చుట్టకాల్చుకునే బుద్ది.
ప్రజల పక్షాన నిలిచి..ఓటు అడిగే బుద్ది రావాలని కోరుకుందాము.
ఇక మోదీ ..గారు జగన్ భుజం మీద తుపాకి పెట్టి ఆంధ్రులను కాల్చుతున్నారు.

ఎక్కడి కక్కడ బీ టీమ్ లు..!
అనైతిక పొత్తులు..!
రహస్య రాజకీయం..!
అంతా ద్రోహమే!
ఈ దుస్ధితి కి కారణం వీరే..!

వ్యక్తులుగా వ్యవస్ధలతో పోరాడలేక పోవచ్చు..!
కాని వీరిని అధికారానికి దూరం చెయ్యగల ఓటు అనే పాశుపతాస్త్రం మన చేతిలో ఉన్నది.

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

 

LEAVE A RESPONSE