Suryaa.co.in

Political News

మీరు మనుషులా? మనిషి రూపంలో ఉన్న ఉన్మాదులా?

నేను 15-18ఏళ్లుగా రాజకీయాలు ఫాలో అవుతున్నాను.. ఈ 18ఏళ్లలో ఎన్నోసార్లు విజయమ్మ గారి గురించి వార్తల్లో విన్నాను.. అన్ని వార్తల్లో పులివెందులలో నాకు ఓటు వెయ్యండి, ముఖ్యమంత్రిగా నా కొడుక్కి ఓటు వెయ్యండి, తెలంగాణలో నా కూతురిని సీఎం చెయ్యండి అని ప్రజలను అడుక్కోడమే కానీ, ఈవిడ ప్రజలకు సాయం చేసిన వార్త నేను ఇప్పటి వరకు నా కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు.. అంటే ప్రజలకు ఈవిడ చేసింది ఏమీ లేదు.. అయినా కూడా సీఎంలు అవ్వడం నా కుటుంబ హక్కు కాబట్టి, మీరంతా నాకు, నా పిల్లలకు ఓట్లు వేసి గెలిపించండి అని సెంటిమెంట్ తో ఓట్లు అడిగింది..

ఇంకోపక్క భువనేశ్వరి గారు.. ఆమె గురించి ఈ 18ఏళ్లలో వార్తల్లో చూసింది చాలా చాలా తక్కువ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సతీ సమేతంగా గుడులలో పట్టు వస్త్రాలు సమర్పించాలి కాబట్టి, ఆ సమయంలో చూడటం తప్ప.. రాజకీయాల్లో ఆమెను ఎప్పుడూ చూడలేదు.. ఇక ప్రజలకు తను చేసిన సేవా కార్యక్రమాల అన్నీ ఇన్నీ కావు.. 26ఏళ్ల క్రితం అంటే తన తండ్రి మరణించిన తర్వాత తండ్రి పేరుతో, “NTR మెమోరియల్ ట్రస్ట్” ను స్థాపించారు.. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సాయం అందించారు..

1. కృష్ణాజిల్లా చల్లపల్లిలో NTR మోడల్ స్కూల్ ను స్థాపించి అందులో వేలమంది అనాధ పిల్లలను ఉచితంగా చదిస్తున్నారు..
2. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా స్కాలర్ షిప్స్ అందిస్తూ 4,193 మంది పేద విద్యార్థులను 3.44కోట్ల ఆర్థిక సాయం అందించారు..
3. బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రతి ఏటా 50మంది ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఇప్పటివరకు 1.93కోట్లు స్కాలర్ షిప్ రూపంలో అందించారు..
4. NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1,617మంది విద్యార్థులను కాలేజీలలో చదివిస్తున్నారు..
5. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్థాపించి 7,345 యువతీ యువకులకు శిక్షణ ఇప్పించి వారిలో 2,500 మందికి ఉద్యోగాలు ఇప్పించారు..
6. జాబ్ మేళాలు నిర్వహించి మరో 4,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు..
7. గత 26సంవత్సరాలలో 11,372 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 19,07,443 మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు..
8. రక్త నిధి కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 83,582 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందులో 20,045 యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధి బాధితులకు 55,048 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర సేవల నిమిత్తం అందించారు..
9. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 క్లస్టర్ మోడల్ ఆర్వో ప్లాంట్లను, 42ఇండివిడ్యువల్ ప్లాంట్లను నెలకొల్పి తాగు నీరు అందిస్తున్నారు..
10. NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రకృత్తి విపత్తులు సంభవించిన సమయాల్లో ఇప్పటివరకు 20లక్షల మందికి సాయం అందించారు..
11. 2013లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు 500మంది తెలుగు వారిని ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చేర్చారు..
12. 2014లో హుదుడ్ తుఫాన్ వచ్చినప్పుడు 50,000మంది బాధితులకు మందులు, ఆహారం, మజ్జిగ, పాలు, త్రాగునీరు అందించారు..
13. 2016లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు 10బస్తీలలోని 5,000మంది పేదలకు సాయం అందించారు..
14. 2009లో కర్నూల్, మహబూబ్ నగర్ లో వరదలు వచ్చినప్పుడు 54వైద్య బృందాల ద్వారా శిబిరాలు నిర్వహించి 15కోట్ల విలువైన మందులు, వస్త్రాలు, దుప్పట్లను వరద బాధితులకు పంపిణీ చేశారు..
15. 2021లో చిత్తూరు నెల్లూరులలో భారీ వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినప్పుడు 50వేల మందికి పైగా వరద బాధితులకు ఆహారం, పాలు, త్రాగు నీరు, దుప్పట్లు, నిత్యావసర సరకులు అందించారు.. అంతేకాకుండా వరదల్లో మరణించిన 48మంది కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున 48లక్షలు సాయం చేశారు..
16. కరోనా సమయంలో 1,500 మంది కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించారు.. 2లక్షల మాస్కులు అందించారు.. 29లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు.. 1.35కోట్లతో ఏపీ, తెలంగాణలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు..
17. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా అధిక బరువు, కొలెస్టరాల్, డయాబెటీస్, రక్తపోటు నియంత్రణకై న్యూట్రిపుల్ యాప్ ద్వారా న్యూట్రిషనిస్టుల ద్వారా డైట్ ప్లాన్లను, ఆరోగ్య సలహాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది..
18. పేద మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని NTR ట్రస్ట్ సంజీవని పేరుతో ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది..

మరి తండ్రి పేరుతో స్థాపించిన ట్రస్ట్ ద్వారా ఇన్ని లక్షల మందికి సేవ చేస్తూ కూడా.. ఒక రాజకీయ నాయకుడి భార్య అయ్యుండీ, ఒక రాజకీయ నాయకుడికి తల్లి అయ్యుండి కూడా.. తన ఒక్కగానొక్క కొడుకు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినా కూడా, నా కొడుక్కి ఓటు వెయ్యండి అని అడగలేదు.

40ఏళ్లుగా భర్త రాజకీయాల్లో ఉన్నా కూడా నా భర్తకి ఓటు వెయ్యండి అని ఎప్పుడూ అడగలేదు.. కానీ ఏ తప్పూ చెయ్యని తన భర్తను అకారణంగా, అన్యాయంగా జైల్లో పెడితే తప్పనిసరి పరిస్థితుల్లో నిజం గెలవాలి అని, ప్రజల ముందుకు వస్తే అండగా ఉండాల్సింది పోయి విమర్శలు చేస్తారా? మీరు అసలు మనుషులా మనిషి రూపంలో ఉన్న ఉన్మాదులా?

– ఆదిత్య

LEAVE A RESPONSE