తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు చెల్లించే సభ్యత్వ రుసుమును అవినీతి సొమ్ముగా చూపుతోంది
– జగన్ కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబుని జైలుకు పంపిన సీఐడీ, పైసా అవినీతి నిరూపించలేని దుస్థితి
• చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు బోగస్ కేసు అని సీఐడీ విచారణతో తేలిపోయింది.
• జగన్ ఆదేశాలప్రకారం నడుచుకున్న సీఐడీ చివరకు ఒక గాసిప్ ఏజెన్సీగా నిలిచింది
• టీడీపీ సభ్యత్వం పొందడానికి కార్యకర్తలు చెల్లించే సభ్యత్వ రుసుము… కార్యకర్తలు, వారి కుటుంబాలను ఆదుకోవడానికి పార్టీ అందించే ప్రతిరూపాయి మొత్తం పారదర్శకమే.
• కార్యకర్తలు.. పార్టీ మధ్య జరిగే ప్రతి చెల్లింపు వివరాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ కంటాక్స్ విభాగానికి తెలియచేస్తూనే ఉంటుంది.
• నిన్నటివరకు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలే లేవన్న మంత్రులు..సదరు కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి, నేడు శిక్షణా కేంద్రాలకు మంచి పరికరాలు.. సాఫ్ట్ వేర్ అందలేదనడం వారి రెండునాల్కల ధోరణికి నిదర్శనం.
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
చంద్రబాబునాయుడిపై వైసీపీప్రభుత్వం పెట్టించిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు బోగస్ కేసు అని ప్రజలకు అర్థమైందని, రూపాయి సొమ్ము టీడీపీ అధినేతకు, లోకేశ్ కు, ఇతర నేతలకు వచ్చినట్టు జగన్ రెడ్డి గానీ, అతని జేబు సంస్థ సీఐడీ గానీ నిరూపించ లేకపోయిందని, రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబుని అక్రమంగా తప్పుడు కేసులో ఇరికించి, అన్యాయంగా జైలుకు పంపారన్న టీడీపీ వాదన నిజమని నిర్ధారణ అయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేశాక సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని చెప్పిన సీఐడీ, ఆయన్ని జైలుకు పంపి 50రోజులైనా ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. సీఐడీ స్వతంత్ర్య దర్యాప్తు సంస్థగా కాకుండా ఒక గాసిప్ ఏజెన్సీగా నిలిచింది. దర్యాప్తు సంస్థలు ఏవైనా సాక్ష్యాలు ఉన్నాక నిందితుల్ని అరెస్ట్ చేస్తారు. కానీ రివర్స్ ముఖ్య మంత్రి రివర్స్ పాలనలో సీఐడీ కూడా రివర్స్ లో పనిచేస్తోందని దాని పనితీరుతో తేలి పోయింది. కేవలం జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటానికే సీఐడీ పరిధిదాటి వ్యవహ రించింది. చంద్రబాబుకి బెయిల్ రాకుండా చేయడం కోసం జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంటే, సీఐడీ ముఖ్యమంత్రికి సహకరిస్తూ, న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టిస్తోంది.
కార్యకర్తలు పార్టీకి అందించే సభ్యత్వ రుసుము… పార్టీ కార్యకర్తల కుటుంబాల సంక్షేమానికి వెచ్చించే ప్రతిపైసా పారదర్శకమే. వాటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ కంటాక్స్ విభాగానికి తెలియచేస్తూనే ఉంటుంది
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలను, సభ్యత్వం పొందడానికి చెల్లించిన రుసుముని ఆ పార్టీకి వచ్చిన అవినీతి సొమ్ముగా జగన్ ప్రభు త్వం, సీఐడీ చిత్రీకరించడం వాటి దిగజారుడుతనానికి నిదర్శనం. 2014-15లో 52.94 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ సభ్యత్వం పొందడానికి ఒక్కొ క్కరు రూ.100చొప్పున చెల్లిస్తే… తద్వారా పార్టీకి రూ.52.94కోట్ల విరాళం వచ్చింది. 2016-17లో 60.75లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం పొంది, రుసుముగా రూ.60.75 కోట్లు పార్టీకి అందించారు.
2018-19లో 43.23లక్షల మంది సభ్యత్వం పొందితే, పార్టీకి రూ.43.23కోట్ల విరాళం వచ్చింది. మొత్తంగా 2014-15 నుంచి 2018-19 వరకు చూస్తే కేవలం సభ్యత్వ రుసుముగానే రూ.159.8కోట్లు పార్టీకి వచ్చాయి. కార్యకర్తలు ఇచ్చే సభ్యత్వ రుసుము..ఇతర విరాళాల కంటే పార్టీ తనను నమ్ముకున్నవారికి అందించే చేయూత, సంక్షేమం, ఆర్థిక సహాయమే ఎక్కువగా ఉం ది. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం.. వారి పిల్లలను చదివించడం, సభ్యత్వం పొంది మరణించిన వారికి ఇన్సూరెన్స్ ప్రీమియం అందించడం వంటి కార్యక్ర మాలు తెలుగుదేశం పార్టీనే చూసుకుంటోంది.
2014-15 నుంచి 2018-19 వరకు టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రీమియంగా రూ.68.53కోట్లని పార్టీనే బీమా సంస్థల కు చెల్లించింది. 2018-19లోనే రూ.16.2కోట్లు ప్రీమియంగా చెల్లించింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూఇండియా వంటి సంస్థలకే ఒక్కో కార్యకర్తకు రూ.2లక్షల చొప్పున దాదాపు చనిపోయిన 5 వేలమంది కుటుంబాలకు రూ.100కోట్ల ను తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ రూపంలో అందించింది. ఏ ఇన్సూరెన్స్ సంస్థ కూడా వివరాలు లేకుండా ఎలాంటి చెల్లింపులు చేయదు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియం వివరాలు కూడా బీమా సంస్థల వద్ద ఉన్నాయి. తెలు గుదేశం పార్టీ సభ్యత్వం వివరాలు.. కార్యకర్తలుఇచ్చే రుసుము వివరాలు అన్నీ పారద ర్శకమే. యూనియన్ బ్యాంక్ సహకారంతో బిల్ కాల్ మనీ అనే సంస్థద్వారా టీడీపీ కార్యకర్తలు సభ్యత్వం పొందడానికి చెల్లించిన రుసుముని టీడీపీ డిపాజిట్ చేసింది. ఆ సొమ్ములో ఎక్కడా పైసా కూడా అవినీతి సొమ్ములేదు… ఉండదు. కానీ జగన్ సర్కార్.. సీఐడీ కార్యకర్తల కష్టార్జితాన్ని అవినీతిసొమ్ముగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది.
స్కిల్ డెవలప్ మెంట్ … ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ల్లో ఎలాంటి అవినీతి జరగలేదని, రూపాయి కూడా చంద్రబాబుకి అందలేదని తెలిసి, దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియకే సీఐడీ టీడీపీకార్యకర్తలు పార్టీకి ఇచ్చిన సభ్యత్వరుసుముని అవినీతి సొమ్ముగా చిత్రీకరిస్తోంది
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకి ఎటువైపు నుంచి రూపాయి వచ్చినట్టు నిరూపించలేని దుస్థితికి దిగజారిన సీఐడీ చివరకు దిక్కుతోచక కార్యకర్తలు సభ్యత్వం పొందడానికి పార్టీకి చెల్లించిన సొమ్ముని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అవినీతి సొమ్ము గా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ సొమ్ముగా చూపడానికి నానా తంటాలు పడుతోంది. జగన్ రెడ్డి తన పక్కన హత్యలు చేసేవారిని, అత్యాచారాలు చేసేవారిని, దుర్మార్గుల్ని, బాబాయ్ ని చంపినవారిన పెట్టుకొని, ఇతరులు తప్పు చేశారని నిస్సిగ్గుగా అసత్యాలు చెబుతు న్నాడు. చంద్రబాబు అక్రమ అరెస్ట్… ఆయన్ని జైలుకు పంపడంలో జగన్ రెడ్డి అతని ప్రభుత్వం అనుసరించిన తీరుపై ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి.
జగన్ రెడ్డి జేబు సంస్థ సీఐడీ.. చంద్రబాబుని జైల్లో పెట్టి చేయరాని పెద్ద తప్పు చేసింది. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికే చివరకు సిగ్గులేకుండా కార్యకర్తలు పార్టీ సభ్యత్వానికి చెల్లించిన సొమ్ముని అవినీతిసొమ్ము అని చెబుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు ఏర్పాటు చేయకముందే, తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఎందరో కార్యకర్తలు తెలుగుదేశం సభ్యత్వం పొంది, నిర్ణీతరుసుముని పార్టీకి చెల్లించారు. ఇదంతా పార్టీ ఆవిర్భవించిన కొన్నాళ్ల నుంచి జరుగుతూనే ఉంది. తమ పార్టీకి వచ్చే విరాళాలు..ఇతర సొమ్ము వివరాల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఇన్ కంటాక్స్ విభాగానికి తెలియచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ సొమ్ము ఎలా వచ్చిందో.. ఎవరి ద్వారా వచ్చిందో చెప్పడానికి మాకు.. మా పార్టీకి ఎలాంటి అభ్యంత రాలు లేవు.
విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా నరేంద్రకుమార్ స్పందన…
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో తప్పు జరిగిందని జగన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది అజయ్ కుమార్ రెడ్డి. ఆయన జగన్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేశ్ మరికొందరు నిన్నటి వరకు రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు లేవు.. వాటిలో పరికరాలు లేవు అని గగ్గోలు పెట్టారు. మరి అదే మంత్రులు, అజయ్ కుమార్ రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఉన్నాయి.. వాటికి అందించిన పరికరాలు… సాఫ్ట్ వేర్ మాత్రం సరిగా లేవని చెబుతున్నారు.
అధికారముందన్న అహంకారంతో మాట్లాడే మంత్రులు.. వైసీపీ నేతల్ని ప్రజలు బట్టలు విప్పి పరుగులు పెట్టించే రోజు దగ్గర్లోనే ఉంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమ మని ప్రజలు నమ్ముతున్నారనే, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు విచక్షణకోల్పోయి నోరు పారేసుకుంటున్నారు. సీఐడీ ప్రభుత్వాధినేత చెప్పుచేతుల్లో పనిచేస్తూ గాసిప్ ఏజెన్సీ గా మారిందని మేం చెప్పడంలేదు.. దాని పనితీరుతో ఆ ఏజెన్సీనే అలా తయారైంది.” అని నరేంద్ర కుమార్ ఎద్దేవాచేశారు.