Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిపక్ష ఎమ్మెల్సీతో అంగన్ వాడీ సిబ్బంది తమ సమస్యలు బాధలు చెప్పుకోవడం నేరమా?

• ఏం తప్పు చేశారని కుప్పంలో 85 అంగన్ వాడీ సిబ్బందికి మెమోలు ఇచ్చి జీతాలు ఆపారో.. ఇద్దర్ని అన్యాయంగా ఎందుకు సస్పెండ్ చేశారో ముఖ్యమంత్రి చెప్పాలి
• తమ సమస్యలు..బాధలు చెప్పుకోవడానికి ప్రతిపక్ష ఎమ్మెల్సీని కలిసిని అంగన్ వాడీ సిబ్బందిపై ప్రభుత్వం కక్షకట్టడం జగన్ మార్కు అహంకార పాలన కాదా?
• వైసీపీ ఎమ్మెల్సీ భరత్ … ఆయన సతీమణి కార్యక్రమాల్లో పాల్గొంటున్న అంగన్ వాడీ సిబ్బంది ప్రభుత్వానికి కనిపించలేదా?
• ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రజల్లోకి వస్తే అంగన్ వాడీ కేంద్రాల దుస్థితి.. అక్కడి పిల్లల ఆకలి కేకలు కనిపిస్తాయి
• 85 మంది అంగన్ వాడీ సిబ్బందిపై ప్రభుత్వం వెంటనే వేధింపులు ఆపాలి. సస్పెండ్ చేసిన ఇద్దర్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. లేకుంటే వారి తరుపున టీడీపీ అంగన్ వాడీ విభాగం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంది
టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

జగన్ రెడ్డి చెప్పేదానికి, చేసేవాటికి ఎక్కడా పొంతన ఉండదని, ప్రజల ముందుకొచ్చిన ప్రతిసారి ఉత్తుత్తి ఉపన్యాసాలు ఇవ్వడం… నా ఎస్సీలు, నాఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని కపటప్రేమ ఒలకబోయడం తప్ప కనీసం పేద మహిళలు, చిన్నారుల కడుపు నింపే అంగన్ వాడీ కేంద్రాలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని చేతగాని ముఖ్యమంత్రిగా చరిత్రే సిగ్గుపడేలా పనిచేస్తున్నాడని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార విభాగాల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే మీ కోసం…!

“ అంగన్ వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడంలో.. పేదపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం సరఫరా చేయడంలో.. అంగన్ వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారంలో విఫలమైన జగన్మోహన్ రెడ్డి.. అపరిచిత మోహన్ రెడ్డిగా మిగిలి పోయాడు. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చూస్తూ నే ఉన్నాం. అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం, చిక్కీల్లో పురుగులు.. ఖర్జూర ప్యాకెట్లలో పాము కళేబరాలు.. కాలపరిమితి ముగిసిన పాలప్యాకెట్ల సరఫరా ఘటన లు చూస్తూనే ఉన్నాం.

వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగే తప్పిదాలు, లోపాలను కూడా సరిచేయలేని అసమర్థ ముఖ్యమంత్రి ఊరికే ఉపన్యాసాల్లో ప్రజలపై ఎక్కడాలేని ప్రేమ చూపడం జగన్ రెడ్డి నయవంచన విద్యల్లో ఒకటనే చెప్పాలి. అంగన్ వాడీ కేంద్రాల్లో పేద పిల్లలు తినే ఆహారాన్ని జగన్ రెడ్డో.. ఆయనసతీమణి భారతి రెడ్డో ఒకసారి తింటే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది.

వేలకోట్ల ప్రజలసొమ్ముతో నిర్మించుకున్న ప్యాలెస్ లలో రాజభోగాలు అనుభవిస్తున్న జగన్ రెడ్డికి..అంగన్ వాడీ సిబ్బంది జీతాలు పెంచడానికి మాత్రం మనసు రాదు
ఎన్నికలకు ముందు అంగన్ వాడీ కేంద్రాలను బ్రహ్మండంగా పునరుద్ధరిస్తానని.. ఆయా కేంద్రాల్లోని సిబ్బంది జీతభత్యాలు పెంచుతానని.. మహిళలు, పిల్లలకు మంచి నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తానని ఇలా జగన్ అనేక ప్రగల్భాలు పలికాడు. తీరా అధికారంలోకి వచ్చాక.. అంగన్ వాడీ కేంద్రాలను అనాథకేంద్రాలుగా గాలికి వదిలేశాడు . గతంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీ సిబ్బంది ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిస్తే, వారిని పోలీసుల ఉక్కు పాదంతో దారుణంగా అణచివేశాడు.

తన చుట్టూ 40మందికిపైగా సలహాదారుల్ని నియమించుకొని వేలకోట్ల విలువైన ప్యాలెస్ లలో ఉంటూ రాజభోగాలు అనుభవిస్తు న్న జగన్ రెడ్డికి..అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచడానికి మాత్రం మనసు రాదు. అంగన్ వాడీ సిబ్బంది జీవితాలు విశాఖపట్నంలో రుషికొండపై జగన్ రెడ్డి నిర్మించు కుంటున్న భారీ భవనంలోని బాత్ టబ్ ఖరీదు కూడా చేయవా?

ఏం తప్పు చేశారని కుప్పంలో 85 అంగన్ వాడీ సిబ్బందికి మెమోలు ఇచ్చి, ఇద్దరిని సస్పెండ్ చేశారో ముఖ్యమంత్రి చెప్పాలి
కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ, తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న ముఖ్య మంత్రి పేదపిల్లల కడుపునింపే అంగన్ వాడీ సిబ్బంది కడుపుకొట్టడం దుర్మార్గం. ముఖ్యమంత్రికి ఎలాగూ అంగన్ వాడీ సిబ్బంది సమస్యలు.. అంగన్ వాడీ కేంద్రాల దుస్థితి పట్టదు. కనీసం స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా పట్టించుకోకపోతే ఎలా? ఆమెకు దోపిడీ తప్ప.. అంగన్ వాడీ సిబ్బంది వేదన.. పిల్లల ఆకలి కేకలు వినిపించ వు. అంగన్ వాడీ కేంద్రాలకు ఆహారపదార్థాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు వసూలు చేస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రి.. మంత్రి ఎంతగా దిగజారారో అర్థమ వుతోంది.

మంత్రి హోదాలో ఆమె రాష్ట్రంలోని ఒక్క అంగన్ వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించింది లేదు. కుప్పంలో 85 మంది అంగన్ వాడీ సిబ్బంది ఏం తప్పుచేశారని ఈ ప్రభుత్వం వారిపై కక్ష కట్టి, జీతాలు నిలిపేసింది? ఇద్దరికి మెమోలు ఇచ్చి..ఎందుకు ఉద్యోగాల నుంచి తొలగించారో ముఖ్యమంత్రి చెప్పాలి. స్థానిక ఎమ్మెల్సీని కలిసి తమ బాధలు చెప్పుకోవడమే వారి నేరమా? కుప్పం వైసీపీ ఎమ్మెల్సీ భరత్ తన కార్యక్రమాలకు, ఆయన సతీమణి నిర్వహిస్తున్న ‘జగనన్నతో జనం- భరతన్నతో మనం’ అనే కార్యక్రమంలో అంగన్ వాడీ సిబ్బందిని వినియోగిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించదు?

ఎలాంటి విచారణ జరపకుండా ..కనీసం సిబ్బందిని సంప్రదించకుండా అన్యాయంగా 85 మంది సిబ్బంది జీతాలు ఆపేసి వారి కడుపులపై కొడతారా? జగన్ రెడ్డి బాధితులైన అంగన్ వాడీ సిబ్బంది, తమను ఎందుకు ఇబ్బందిపెడుతున్నారని స్థానిక సీడీపీవోను కలిస్తే ఆమె.. “వెళ్లి భరత్ సార్ ని కలవండి” అని చెప్పడం ఏమిటి? ప్రభుత్వం అన్యాయంగా సస్పెండ్ చేసిన ప్రమీల, కవిత అనే ఇద్దరు అంగన్ వాడీ టీచర్లు వెళ్లగక్కిన ఆవేదనకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? రాత్రి 9, 10 గంటల వరకు ఇంటింటికీ తిరిగి పనిచేస్తున్న అంగన్ వాడీ సిబ్బందిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి?

జగన్మోహన్ రెడ్డి.. అపరిచిత మోహన్ రెడ్డి కాక మరేమిటి? మూడు నెలలుగా అంగన్ వాడీ సిబ్బందికి జీతాలివ్వని ప్రభుత్వం.. కొత్తగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా పేదల్ని అంగన్ వాడీ కేంద్రాలకు తీసుకొచ్చి, వారి కడుపు నింపమని అక్కడి సిబ్బందిని ఆదేశిస్తుంటే.. వారు ఎలా కడుపునింపుతారు? అంగన్ వాడీ సిబ్బంది జీతాలే ఇవ్వని ముఖ్యమంత్రి.. బహిరంగ వేదికలపై మాత్రం వారిని ఉద్ధరిస్తున్నానని.. తనది పేదల ప్రభుత్వమని సిగ్గులేకుండా గొప్పలు చెప్పుకుంటు న్నాడు. కుప్పంలో అంగన్ వాడీ సిబ్బందిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై న్యాయ పోరాటం చేస్తాం. ప్రభుత్వం తక్షణమే వారికి ఇచ్చిన మెమోలు వెనక్కు తీసుకొని.. సస్పెండ్ చేసిన ఇద్దరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి.” అని సునీత డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE