Suryaa.co.in

Andhra Pradesh Telangana

మద్యం లారీ బోల్తా.. ఎగబడిన జనం

విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది. ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో లారీ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, పలువురు వాహనదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎవరికి నచ్చినట్లు వారు మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే అందుబాటులో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే స్పందించారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. వెంటనే మధురవాడ పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

 

LEAVE A RESPONSE