Suryaa.co.in

Telangana

అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్

– మంత్రి తలసాని

అభివృద్ధి లో దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మొండా డివిజన్ బండి మెట్, జైన్ భవన్, సజ్జన్ లాల్ స్ట్రీట్, టకారా బస్తీ, పాట్ మార్కెట్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా బండి మెట్, ఆదయ్య నగర్ లలో BRS పార్టీ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ప్రచారంలో మంత్రికి ప్రతి ఇంటా పూలమాలలు వేసి మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో, సనత్ నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యాయని చెప్పారు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల లో జరిగిందని తెలిపారు. సనత్ నగర్ లో ఎవరు ఊహించని స్థాయిలో 1400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. గతంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఎంతో అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి KTR గారి సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, తిరిగి BRS ప్రభ్యత్వమే అధికారంలోకి వస్తుందని ఆన్.అన్నారు. మళ్లీ BRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 400 రూపాయలకు వంట గ్యాస్ సిలెండర్, రేషన్ పై సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అదేవిధంగా పేదల కోసం మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు.

మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ BRS అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, రాములు, జయరాజ్, సత్యనారాయణ, మహేష్, అమర్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE