తెలంగాణ ప్రజా సమితి పార్టీ అధ్యక్షురాలు నీరా కిషోర్
హైదరాబాద్ నవంబర్ 23 ;తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తొలి, మలి దశ,ఉద్యమకారుల ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజా సమితి పార్టీ అధ్యక్షురాలు నీరా కిషోర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి ప్రారంభంకానున్న ఈ ప్రత్యేక సమావేశానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తొలి, మలి దశ,ఉద్యమకారుల తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నీరా కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం పోరాడిన తొలిదశ, మలిదశ ఉద్యమకారుల విషయంలో ఎటువంటి సహాయం చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉద్యమకారులందరికీ పెన్షన్, ఇండ్లస్థలాలు, ఉద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో నిర్వహించనున్న సభకు అందరూ రావాలని నీరా కిషోర్ అన్నారు. ఉద్యమకారులందరూ తమతోపాటు ఆధార్ కార్డులను తీసుకురావాలని, తద్వారా భవిష్యత్ లబ్ధిదారుల జాబితాను తాయారు చేయడం జరుగుతుందని నీరా కిషోర్ తెలిపారు.