– ఎస్సీ వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉంది
– పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణం
– బీజేపి అభ్యర్థి మేకల సారంగా పాణి నీ భారీ మెజారిటీతో గెలిపించండి
వారసిగూడ రోడ్ షో సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బిసిలకు రాజ్యాధికారం రావాలంటే బిజెపి అధికారంలోకి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగా పాణి ని గెలిపించాలని కోరుతూ బౌధ్ధ నగర్ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో లో ఆయన పాల్గొని మాట్లాడారు.డివిజన్లలో ను ఎల్ నారాయణ నగర్ నుంచి ప్రారంభమైన రోడ్ షో భారీ ర్యాలీ వారసిగూడ చౌరస్తా వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు ప్రాతినిధ్యత ఇచ్చిన మొదటి పార్టీ బీజేపి అని, ప్రధాని మోడీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన నడుస్తుందని, బీజేపి అధికారంలోకి రాగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవుతారని అన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని మోడీ వైద్య సహాయం కోసం రూ. 5 లక్షలు ను ఈ రాష్ట్రానికి రాకుండా కెసిఆర్ కెసిఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాలకు వడ్డీ లేకుండా రూ.20 లక్షలు ఋణ సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ సీఎం కాలేదు అని బిజెపి గెలిస్తే తొలి బీసీ సీఎం తెలంగాణలో అవుతారని పేర్కొన్నారు.
బీసీ లకు రాజ్యాధికారం రావాలంటే బిజెపి రావాలి అని, బీసీ ప్రధానిగా మోడీ అద్భుతంగా అభివృద్ది చేస్తున్నాడు అని తెలిపారు.కెసిఆర్ లాగా ఫాం హౌజ్ లో పడుకునే సీఎం రాడు అని బిజెపి ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం చేస్తాడు అని , ప్రభుత్వ పథకాలు అందరికీ వస్తాయి అని, పోలీస్ నిర్భంధం ఉండదు అని స్పష్టం చేశారు.
బిజెపి అభ్యర్థి మేకల సారంగా పాణి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎం ఆర్ పి ఎస్ గత 30 సంవత్స రాలుగ ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించామని, ఎస్సీ వర్గీకరణకు బీజేపి కట్టుబడి ఉంది అని,అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రవి ప్రసాద్ గౌడ్, నాగేశ్వర్ రెడ్డి, మేకల కీర్తి హర్ష కిరణ్, తదితరులు పాల్గొన్నారు.