- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఫామ్‌హౌస్‌లలో ఉంటే ఏం తెలుస్తుంది?
- ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్
- ఎక్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : సొంత చెల్లి, బావ ఫోన్లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్ కి ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదు అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నాం. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుంది కేటీఆర్ గారు.. ఫామ్‌హౌస్‌లలో ఉంటే ఏం తెలుస్తుంది?
జూన్ 1న మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని మే 23న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం. రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న డ్రామారావు గారు… అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టి, లోక్‌సభ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో కూడా మిమ్మల్ని ఓడగొట్టిన ప్రజలంతా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు VRS ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.
మీరు ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోనక్కర్లేదు! రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగకూడదు. సవాల్‌కు సిద్ధమేనా కేటీఆర్ గారు?