-అలా మాట్లాడితే కోవర్టులుగా మేము భావిస్తాం
-అలాంటివారు జనసేన ను వీడి…. ఇతర పార్టీ లోకి వెళ్లిపోవచ్చు
-నాకు ప్రజలు, రాష్ట్రం ముఖ్యం… నా విధానాలు నచ్చితే నడవండి… నచ్చకుంటే వెళ్లిపోండి
-టిడిపి వెనుక జనసేన నడవటం లేదు… టిడిపి పక్కన జనసేన నడుస్తుంది
-పెద్ద స్థాయి నుంచి వచ్చామని నా మీద పెత్తనం చేస్తే ఎలా?
-కొంతమంది వెళ్లిపోతామన్నా… నేను ఆపను… అది వాళ్ల ఇష్టం
-మంచి పని చేసేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకూడదు
-వైసీపీ ట్రాప్ లో కొంతమంది పడిపోతున్నారు
-వాళ్ళ మాయలో పడి క్యాస్ట్ పాలిటిక్స్ చేయకండి
-ప్రాణం ఉన్నంత వరకు జనసేన ను ముందుకు తీసుకెళతా
-మన బలం ఎంత, ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆలోచించాలి
-ఊహల్లో విహరించ వద్దు… వాస్తవంలోకి వచ్చి ఆలోచన చేయండి
-జనసేన బలం, బలహీనతలు తెలుసుకునే నేను మాట్లాడతా
-జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
అమరావతి: నాకు పదవులు ముఖ్యం కాదు… ప్రజల కోసమే పని చేస్తా. మంచి పని చేసేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకూడదు. నా సినిమాలు ఆపినా, బెదిరించినా నేనెప్పుడూ జాతీయ స్థాయి నాయకులను అడగలేదు. నా పోరాటం నా గడ్డ పై నేనే చేశాను. నా ఇబ్బందులు ను నేనే ఎదుర్కొని నిలబడతా. నేడు టిడిపి, జనసేన కలిసి వెళ్లడానికి కార్యకర్తలు కూడా ఒక కారణం. స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి, జనసేన కలిసి పని చేశాయి. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలంటే కలిసి వెళ్లాల్సిన పరిస్థితి. చిన్న పొస్ట్ పెడితే, ఆలోచన చెప్పినా బెదిరిస్తారు. తమిళనాడు సూపర్ స్టార్ ను కూడా వీళ్లు తిట్టేస్తారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు కు స్థానం ఉండాలి. ముఖ్యమంత్రి ఎవరు అని వివాదం చేయడానికి చూస్తున్నారు. నాకు ఓట్లు వేయనివారే ఇలాంటి అంశాలను తెర పైకి తెస్తారు.నేను గత ఎన్నికలలో ఫొటీ చేస్తే ఒక్క స్థానం ఇచ్చారు. ముందు నన్ను, నా పార్టీ ని గెలిపించండి. ఆ స్థానాలను బట్టి సీఎం అభ్యర్థి పై చర్చ చేద్దాం. వసుదైక కుటుంబం అనే ఆలోచన లేకుండా ఎలా ముందుకు సాగుతాం? కులాలను కలుపుకుని ఐక్యంగా అడుగులు వేద్దాం.
వైసీపీ ట్రాప్ లో కొంతమంది పడిపోతున్నారు. వాళ్ళ మాయలో పడి క్యాస్ట్ పాలిటిక్స్ చేయకండి. మానవత్వం ఉన్న వాడు అన్ని కులాలను సమానంగా చూస్తారు. ఒక్క కులం అని ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదు. వైసీపీ కులాల వారీగా ప్రజలను చీల్చడానికి కుట్ర చేస్తుంది. 2019 లో నేను ఓడినా… నా వాళ్లే నా వెంట నడిచారు. కొంతమంది వెళ్లిపోతామన్నా… నేను ఆపను… అది వాళ్ల ఇష్టం. సీట్ల కోసం వచ్చిన వాళ్లు మాత్రం సీట్లు మార్చుకున్నారు. పెద్ద స్థాయి నుంచి వచ్చామని నా మీద పెత్తనం చేస్తే ఎలా? ఇద్దరు ఎంపీలు ఉన్న బిజెపి నేడు దేశాన్ని పాలిస్తుంది. నాకు ప్రజలు, రాష్ట్రం ముఖ్యం… నా విధానాలు నచ్చితే నడవండి… నచ్చకుంటే వెళ్లిపోండి.
2009 లో పార్టీ ఓడినా… నడపలేక పోవడం వల్ల తప్పు జరిగింది. నేను నా ప్రాణం ఉన్నంత వరకు జనసేన ను ముందుకు తీసుకెళతా.ఎన్ని అడ్డంలకులు ఎదురైనా పార్టీ నడపాలని తొలిరోజే నిర్ణయం తీసుకున్నా.నేడు ఆరు లక్షల మంది జనసేన తో కలిసి నడుస్తున్నారు. నాయకుడు అనే వాడు అన్నీ తట్టుకుని నిలబడాలి. మన బలం ఎంత, ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆలోచించాలి. జగన్ అనే వాడు మహానుభావుల తరహాలో పాలన చేస్తే ఒంటరిగానే పోటీ చేసే వాళ్లం. జగన్ చాలా దిగజారి చాలా నీచంగా మాట్లాడాడు. అయినా నాకు సంస్కారం ఉంది…వాళ్ల లాగా నేను మాట్లాడను.
నా పార్టీ నుంచి వెళ్లిన వారితో నన్ను తిట్టిస్తున్నారు. వైసిపి నాయకులు బూతులు తిడుతున్నారు. రాష్ట్రం కోసం ఎన్ని మాటలు పడటానికైనా సిద్ధంగా ఉన్నాను. వచ్చేది టిడిపి, జనసేన సంకీర్ణ ప్రభుత్వమే. అప్పుడు తిట్టిన వాళ్లంతా బాగా గుర్తు పెట్టుకోండి. టిడిపి వెనుక జనసేన నడవటం లేదు… టిడిపి పక్కన జనసేన నడుస్తుంది. సనా తన ధర్మం ప్రకారం జనసేన పని చేస్తుంది. అన్ని మతాలు, కులాలను కలుపుకుని అడుగులు వేద్దాం.
సంక్షేమ పధకాలు ప్రజలకు అవసరం. నాసొంత డబ్బు ఇస్తున్న నేను, ప్రభుత్వ ధనాన్ని సక్రమంగా పంచలేమా? నాలుగు గ్యాస్ సిలిండర్ లు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. వైసీపీ నాయకుడు సక్రమంగా పాలన చేస్తే గౌరవించే వాళ్లం. అతని అరాచక పాలన వల్లే నేడు ఈ నిర్ణయాలు తీసుకున్నాం. కేవలం వంద రోజులే సమయం ఉంది. ఎన్నికలలో సమర్థవంతంగా పాల్గొనే సత్తా మనకి ఉందా? ఓట్లు వేసే ప్రజలను పోలింగ్ బూత్ ల వరకు తీసుకెళ్లాలి. గతంలో ఇటువంటి అంశాల్లో మనం విఫలమయ్యాం.
నాయకుల తో తిరిగిన వారికి కనీసం భోజనం పెట్టలేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే కడుపు మాడ్చమని కాదు. ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఖర్చు చేయండి. మనం పోటీ ఎక్కడ చేయవచ్చు… ఎలా గెలవచ్చో ఆలోచన చేయండి. అధికారాన్ని కలిసి పంచుకునేలా జనసేన విజయం కోసం పని చేయండి. ఊహల్లో విహరించ వద్దు… వాస్తవంలోకి వచ్చి ఆలోచన చేయండి. జనసేన బలం, బలహీనతలు తెలుసుకునే నేను మాట్లాడతా. ఎపిలో సుస్థిరత, సమైక్యత, సంపద అంశాలతోనే ముందుకు సాగుదాం. వీటి కోసమే నేను టిడిపి తోపొత్తు పెట్టుకున్నా.
రాజధాని లేని రాష్ట్రం గా ఏపీ నాశనం చేశారు. చుక్కాని లేనినావ గా మార్చారు. అమరావతే ఏకైక రాజధాని అనేది జనసేన సిద్దాంతం. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధి, రాయలసీమ ను ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తాం. లోతుగా అధ్యయనం చేసే నేను మాట్లాడుతున్నా. పదేళ్ల పాటు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని నిలబడ్డాం. 2019 ఎన్నికలలో ఓటమి తరువాత చాలా మంది నా దరిదాపుల్లోకి రాలేదు. నా యువత, ఆడపడుచు లు, కార్యకర్తలు మాత్రం అండగా ఉన్నారు. వారి భవిష్యత్తు కోసమే నేను తీసుకున్న ఈ పొత్తు నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తాం.
జనసేన అధికార ప్రతినిధులు అంశాల పై అవగాహన పెంచుకుని చర్చలకు వెళ్లండి. వాళ్లు నోరు పారేసుకున్నారని, మనం దిగజారి మాట్లాడవద్దు. పదేళ్లపాటు జనసేన ను నేను నడిపిన తీరును బిజెపి నాయకులు అర్ధం చేసుకున్నారు. కానీ నాతో కలిసి నడిచిన కొంతమంది మాత్రం అర్ధం చేసుకోలేక పోయారు. మిడిమిడి జ్ఞానం తో ఏదేదో మాట్లాడతారు. అలాంటివారు జనసేన ను వీడి…. ఇతర పార్టీ లోకి వెళ్లిపోవచ్చు. మోడీ, నడ్డా, చంద్రబాబు వంటి వారికి నా భావజాలం అర్ధమైంది. ఎన్ని గాయాలు జరిగినా… నేను తట్టుకుంటాను.
నా సీటుతో పోటీ చేసి.… నన్ను తిడితే ఎలా? మీకు ఇష్టం లేకుంటే మీ నిర్ణయం మీది. సంతోషంగా వారు వెళ్లిపోవచ్చు. ఇక నుంచి టిడిపి, జనసేన పొత్తు గురించి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దు. అలా మాట్లాడితే కోవర్టులుగా మేము భావిస్తాం. కురుక్షేత్ర యుద్ధం అంటున్న జగన్ అర్జునుడు, కర్ణుడు కాదు. లక్ష కోట్లు దొబ్బేసి… జైలుకు వెళ్లి వచ్చిన దొంగ. దోపిడీ దారులను తరిమి కొట్టే పోరాటం లో మనకి ప్రజలు అండగా ఉంటారు.
ఈ వంద రోజులూ అందరూ ప్రజల్లోకి వెళ్లండి… వాస్తవాలు వివరించండి. జనసేన నాయకులు, కార్యకర్తలు బాధ్యతతో పని చేయండి. మన పొత్తు లు ఎలా ఉన్నా డెబ్బై శాతం అందరూ అంగీకరించారు. అభ్యంతరం ఉన్న ఇతర అంశాలు అంతర్గతంగా చర్చించుకుందాం.