కాకినాడ: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కాకినాడ నగరంలో దుమ్మురేపింది. యువగళం రాకతో కాకినాడ నగరం జనజాతరను తలపించింది. చొల్లంగిపేట నుంచి ప్రారంభమైన 214వరోజు (శుక్రవారం) యువగళం పాదయాత్రకు కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. కాకినాడ సినిమారోడ్డులో లోకేష్ పాదయాత్రకు కనివినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. యువనేత లోకేష్ కు స్వాగతం పలుకుతూ నగర వీధుల్లో అడుగడుగునా జనసేన – టిడిపి ఫ్లెక్సీలు వెలిశాయి.
యువగళం జెండాలు చేతబూని టిడిపి-జనసేన కార్యకర్తల ఘనస్వాగతం పలికారు. యువనేతను చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు. సైకో పోవాలి – సైకిల్ రావాలంటూ నినాదాలతో నగర వీధులు హోరెత్తాయి. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ వద్ద క్రైస్తవ మతపెద్దలు యువనేతకు ఆశీర్వచనాలు అందించారు. నగరంలో వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలుసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు. మత్స్యకారులు, లారీఓనర్స్ అసోసియేన్ ప్రతినిధులు, న్యాయవాదులు, దళితులు, డ్వాక్రా మహిళలు, దివ్యాంగులు యువనేతను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
కాకినాడ చొల్లంగిపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర గురజనాపల్లి, ఎంఎస్ ఎన్ చారిటీ, ఘాటీ సెంటర్, సినిమారోడ్డు, కల్పన సెంటర్, ఆనందభారతి గ్రౌండ్స్, వైఎస్సార్ బ్రిడ్జి, కోకిల సెంటర్, ఆర్ఎంసి గ్రౌండ్స్, నాగమల్లితోట, సర్పవరం జంక్షన్ మీదుగా తిమ్మాపురంలోని యార్లగడ్డ గార్డెన్స్ విడిది కేంద్రానికి చేరుకుంది. 214వరోజు యువనేత లోకేష్ 18.2 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2944.6 కి.మీ. మేర పూర్తయింది. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం పిఠాపురంలో జరిగే బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు.
తెలంగాణా పోలింగ్ రోజే రైతులు గుర్తొచ్చారా జగన్?
కరవుతో రైతులు అల్లాడుతుంటే కనీసం సమీక్ష కూడా చేయని జగన్ కి తెలంగాణ పోలింగ్ రోజు రైతులు గుర్తొచ్చారు, సాగర్ ఆయకట్టు రైతులపై ప్రేమ పొంగి పొర్లింది, పోలీసుల్ని పంపి నాగార్జున సాగర్ పై శాంతిభద్రతల సమస్య క్రియేట్ చేయించాడు. ఇదీ మరో కోడికత్తి, బాబాయ్ గుండెపోటు డ్రామా లాంటిదేనని యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. కాకినాడ రూరల్ సర్పవరంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… జగన్ కి భయం పట్టుకుంది. జగన్ కి చంద్రబాబుని చూస్తే భయం, పవన్ కళ్యాణ్ ని చూస్తే భయం, లోకేష్ ని చూస్తే భయం. చంద్రబాబు భవిష్యత్తు కి గ్యారెంటీ కార్యక్రమం చేస్తే జగన్ కి భయం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే జగన్ కి భయం, లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తే జగన్ కి భయం. సొంత అమ్మని చూసినా జగన్ కి భయమే.. సొంత చెల్లిని చూసినా జగన్ కి భయమే. ఆఖరికి ప్రజల్ని చూసినా జగన్ కి భయమే అందుకే పరదాలు కట్టుకొని దొంగలా వెళ్తాడు.తెలుగుదేశం ఘన చరిత్ర ఉన్న పార్టీ, వైసిపి గజదొంగలపార్టీ.
కోడికత్తి వారియర్స్ అని పేరు పెట్టండి!
జగన్ ఐపీఎల్ టీము పెడతామంటున్నాడు..దీనికి కోడికత్తి వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుంది.. సీనియర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మధు. అబ్బో మామూలు టీము కాదు. ఈ మధ్య ప్రకటించిన అన్ని కార్యక్రమాలు తుస్సుమన్నాయి. ఇప్పుడో కొత్త స్కీం తెచ్చాడు దాని పేరు ఆడుదాం ఆంధ్రా అంట. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్న జగన్ ఇపుడు ఆడుదాం ఆంధ్రా అంటూ కొత్త డ్రామా. నియోజకవర్గానికి ఓ ఇండోర్ స్టేడియం అన్నాడు. క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తానని అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. కానీ ప్లేయర్స్ నుండి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. స్టేడియంలు, గ్రౌండులలో ప్రాక్టీస్ చేయడానికి, ఆడ్డానికి వచ్చినవాళ్లని ఫీజులు కట్టకపోతే రావొద్దంటూ తరిమేస్తున్నాడు ఈ జగన్. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమానికి తెలుగుపేరు పెట్టి బిల్డప్ ఇస్తున్నాడు.
కేకపుట్టించిన కాకినాడ
కాకినాడ కేక పుట్టించింది. కాకినాడ రూరల్, టౌన్ నియోజకవర్గాల ప్రజలు, టిడిపి – జనసేన నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు. కాకినాడ కాజా ఎంత స్వీట్ గా ఉంటుందో ఇక్కడ ప్రజలు అంత స్వీట్ గా ఉంటారు. శ్రీ భావనారాయణ స్వామి ఆలయం, జామియా మస్జీద్, చర్చ్ స్క్వేర్ ఉన్న పుణ్య భూమి కాకినాడ. గొప్ప చరిత్ర ఉన్న కాకినాడలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. టిడిపి కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టిన వారు కాకినాడ లో ఉన్నా కంబోడియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు కూడా శిక్ష తప్పదు.
ఓటమి భయంతోనే చంద్రబాబు అరెస్టు
వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబుని అరెస్ట్ చేసాడు. న్యాయానికి సంకెళ్లు వేసాడు..చంద్రబాబు గారిని 53 రోజులు బంధించాడు. చంద్రబాబు చేసిన తప్పేంటి? ప్రజల తరపున పోరాడటం తప్పా? జగన్ చేసే తప్పులను ప్రశ్నించడం తప్పా? కుటుంబం కంటే ప్రజలే ఎక్కువ అనుకోని రాష్ట్రం కోసం కష్టపడటం తప్పా? లక్ష కోట్ల ప్రజాధనం దొబ్బిన దొంగ జగన్.. చంద్రబాబుకి అవినీతి మరక అంటించాలని ప్రయత్నించాడు. ముందు 3 వేల కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 370 కోట్లు అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్ కి డబ్బులు వచ్చాయి అంటున్నారు. ఆ 27 కోట్లు ఏంటో తెలుసా.. మన పసుపు సైన్యం సభ్యత్వం తీసుకోని కట్టిన రుసుము. ఆరోపణలు తప్ప ఆధారాలు లేవని బెయిల్ ఇస్తూ హైకోర్టు తేల్చేసింది.
చంద్రబాబుది ప్రజాబలం… జగన్ ది ధనబలం
జగన్ వ్యవస్థల్ని మ్యానేజ్ చేసి చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టినా ఆఖరికి నిజమే గెలిచింది. వైసిపి నాయకులు చేసిన ఆరోపణలు ఒక్కరు కూడా నమ్మలేదు. జగన్ ప్రిజనరీ… చంద్రబాబు అంటే విజనరీ. బాబుది ప్రజా బలం… జగన్ ది ధన బలం. బాబుకి ప్రజల పై నమ్మకం.. జగన్ కి దొంగ ఓట్ల పై నమ్మకం. టిడిపి ఘన చరిత్ర ఉన్న పార్టీ… వైసిపి గజ దొంగల పార్టీ.
నాది జగన్ మాదిరి వీక్లీఆఫ్ యాత్రకాదు!
యువగళం పాదయాత్ర కి జగన్ పాదయాత్ర కి తేడా ఏంటో మీకు తెలియాలి. జగన్ పాదయాత్ర కి ప్రతి వారం సెలవులే…కోర్టు వాయిదా పేరుతో హైదరాబాద్ వెళ్లి ప్యాలస్ లో పడుకునేవాడు. కానీ మీ లోకేష్ యువగళానికి బ్రేకులు లేవు.. శని, ఆదివారం సెలవులు లేవు, కోర్టు కేసులు లేవు, పండగలు లేవు. యువగళం ప్రజాగళం గా మారింది, అందుకే జగన్ పాదయాత్ర ను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. పోలీసుల్ని పంపి నన్ను అడ్డుకున్నాడు, నా మైక్ వెహికల్ సీజ్ చేసారు, నా మైక్ పట్టికెళ్లిపోయారు, నేను నిలబడిన స్టూల్ కూడా తీసుకుపోయారు. జిఓ.1 తెచ్చినప్పుడే జగన్ కి చెప్పా మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో యువగళం ఆగదు అని. ఆ తరువాత పిల్ల సైకోలను పంపి రాళ్లు, గుడ్లు వేయించాడు… మన వాళ్లు గట్టిగా తన్ని, కట్లు కట్టి పంపారు.
మా గొంతు నొక్కేవాడు ఇంకా పుట్టలేదు!
జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం..నాది అంబేద్కర్ రాజ్యాంగం. జగన్ ది తాత ఇచ్చిన అహంకారం.. నాది తాత ఇచ్చిన గొంతు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఇచ్చిన గొంతు నొక్కే వాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. ఏమి పీకలేక జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేసి నన్ను ఆపాడు. అయినా యువగళం ఆగదు .. తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడతాం. సాగనిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే వైసిపి కి శవయాత్ర. జగన్ ని చూస్తే పిట్టలదొర గుర్తిస్తాడు.
ఇసుకలో బొక్కింది రూ.5400 కోట్లు!
జగన్ రోజూ పందికొక్కులా ఇసుక తింటున్నారు. టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ. 1500, జగన్ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.5000.రోజుకి ఇసుక దోపిడీ లో జగన్ వాటా ఎంతో తెలుసా రూ. 3 కోట్లు, నెలకి రూ.90 కోట్లు, సంవత్సరానికి రూ.1080.ఐదేళ్లలో జగన్ భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి సంపాదించిన ఇసుక ఆదాయం ఎంతో తెలుసా రూ.5,400 కోట్లు. కరువు – జగన్ కవల పిల్లలు. జగన్ ది దరిద్ర పాదం. 122 ఏళ్లలో ఎప్పుడూ లేని కరువు రాష్ట్రాన్ని శనిలా పట్టిపీడిస్తోంది. సాగునీరు లేక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. జగనాసురుడి ఇసుక దాహానికి ఏకంగా అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి.
కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్ జగన్
జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.
మహిళల డబ్బు కొట్టేసిన జగన్
జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.
యువగళం నిధితో ఆదుకుంటాం
జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.
ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం
టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
ఉద్యోగులు, పోలీసులకూ ఎగనామం
జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు. జగన్ తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతధంగా ఇస్తాం.
బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. అమర్నాధ్ గౌడ్ ని పెట్రోల్ పోసి చంపేసారు. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.
దళితులు వేధించేవారిపై కఠిన చర్యలు
డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి కొవ్వూరు లో మహేంద్ర వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు.
రూరల్ లో అవినీతి ఫుల్!
కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని కన్నబాబుని ప్రజలు గెలిపించారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి కూడా అయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? మీ జీవితాలు ఏమైనా మారాయా? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు..అవినీతి ఫుల్లు. అవినీతి లో జగన్ ని మించిపోయేసరికి కన్నబాబు మంత్రి పదవి పోయింది. అందుకే ఆయన పేరు మార్చాను కరప్షన్ కన్న. నియోజకవర్గాన్ని కేకులా కోసి కుటుంబ సభ్యులకు పంచేసారు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్ని కరప్షన్ కన్న తండ్రి, తమ్ముడే చేస్తున్నారు.
ఏ పనిచేయాలన్నా కప్పం కట్టాల్సిందే
నియోజకవర్గం లో ఏ పని జరగాలి అన్నా కన్నబాబు తండ్రికో, తమ్ముడుకో కప్పం కట్టాల్సిందే. సెంటు స్థలాల పేరుతో భారీ అవినీతి కి పాల్పడ్డారు. భూముల కొనుగోలు నుండి లెవెలింగ్ వరకూ డబ్బులు కొట్టేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వారిని వేధిస్తున్నారు. ఎకరానికి ఇంత అని వసూలు చేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు, లారీ ట్యాంకర్ల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. కరప్షన్ కన్న తమ్ముడు వేధింపులు తట్టుకోలేక ఈ మధ్యే డాక్టర్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ రూరల్ కి అనేక హామీలు ఇచ్చి జగన్, కన్నబాబు మర్చిపోయారు. కరపలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటుకు జగన్ హామీ ఇచ్చి మర్చిపోయాడు. కాకినాడ రూరల్ పరిధిలోకి వచ్చే కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి మర్చిపోయారు.
ఎత్తిపోతల పథకాలు పూర్తిచేస్తాం
టిడిపి హయాంలో వేములవాడలో రెండు, పెద్దాపురం పాడులో ఒకటి ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాం. వైసిపి ప్రభుత్వం ఆ పనులు ఆపేసింది. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. టిడిపి హయాంలో కొంగోడు గ్రామంలో ఎత్తిపోతల పథకం, కాలువ పై బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తే వైసిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. రూరల్ లో ఆరు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రత్యేకాధికారుల పాలనలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తాం. సమస్యను పరిష్కరిస్తాం.
కాకినాడ రూరల్ ను అభివృద్ధి చేస్తాం!
టిడిపి హయాంలో 50 కోట్లతో ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి చేసాం. ఇప్పుడు వైసిపి దానిని మూసేసింది. తిరిగి దానిని ప్రారంభిస్తాం. కాలువలు ఆధునీకరణ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కాలువలు ఆదునీకరిస్తాం. ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో కనీస మౌలిక వసతులు లేవు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పిస్తాం. కాకినాడ రూరల్ లో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. కాకినాడ రూరల్ లో రోడ్లు ఘోరంగా ఉన్నాయి. కొత్త రోడ్లు వేస్తాం.
కాకినాడను దోచేస్తున్న ద్వారంపూడి
కాకినాడ సిటీని అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించారు. కాకినాడ సిటీ ఏమైనా అభివృద్ధి చెందిందా? చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది. కాకినాడ సిటీని డ్రగ్స్, అవినీతి, భూకబ్జాలు, సెటిల్మెంట్స్, మద్యం అక్రమ రవాణా, పేకాట క్లబ్స్ కి అడ్డాగా మార్చేశాడు చంద్రశేఖర్ రెడ్డి. అహంకారానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అచ్చం చంద్రశేఖర్ రెడ్డిలానే ఉంటుంది. అందుకే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు మార్చాను దోపిడీ శేఖర్. గంజాయి, హెరాయిన్ డ్రగ్స్ అమ్మిస్తూ కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు. మున్సిపాలిటీ, స్మార్ట్ సిటీ నిధులు కాజేసాడు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులు ధ్వంసం చేసాడు.
వందలకోట్ల భూములు స్వాహా
శశికాంత్ నగర్ లో పార్కు కి చెందిన 2 ఎకరాల భూమికి దొంగ పత్రాలు సృష్టించి బినామీలకు టిడిఆర్ బాండ్స్ ఇష్యూ చేసి రూ.130 కోట్లు కొట్టేసాడు. కాకినాడ సూర్యారావుపేట లో 18 ఎకరాల భూమికి ఫోర్జరి డాక్యుమెంట్స్ సృష్టించి కొట్టేసాడు. సెంటు స్థలాల పేరుతో భారీ స్కామ్ కు పాల్పడ్డాడు. తండ్రి, తమ్ముడు ఆధ్వర్యంలో రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్మి కోట్లు కొట్టేస్తున్నారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా పాపపు సొమ్ము పోగేస్తున్నాడు. భూకబ్జాలు, సెటిల్మెంట్స్, మద్యం, పేకాట, కార్పొరేషన్ నిధుల దోపిడీ, మార్కెట్ షాపుల్లో వసూళ్లు. పోర్ట్ ఎగుమతుల్లో కమిషన్లు, వ్యాపారస్తులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నాడు. జగన్ కి బినామీ దోపిడీ శేఖర్. అధికారంలోకి వచ్చాక దోపిడీ చంద్రశేఖర్ రెడ్డి తిన్నది మొత్తం కక్కిస్తాం.
జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
జగన్ కాకినాడ సిటీ కి అనేక హామీలు ఇచ్చాడు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామని అన్నాడు. 10 వేల ఇళ్లు కట్టిస్తా అన్నాడు. పోర్టు కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు. సిటీ కి దూరంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు ఇళ్లు కట్టిస్తాం. భూకబ్జాలకు గురైన స్థలాలు అసలైన యజమానులకు ఇస్తాం. భూకబ్జాలు, సెటిల్మెంట్స్, పేకాట క్లబ్బులు, డ్రగ్స్ నుండి యువతను కాపాడతాం.
యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం
మళ్లీ కాకినాడ అభివృద్ధి చెందాలి అంటే టిడిపి – జనసేన ప్రభుత్వం రావాలి. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. మత్స్యకారులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యేలుగా ఉన్న పిల్లి అన్నంత లక్ష్మి, కొండబాబు కాకినాడ ను అభివృద్ధి చేసారు. పేదలకు ఇళ్లు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు, సిసి రోడ్లు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు.
3).
*నారా లోకేష్ ను కలిసిన కాకినాడ మత్స్యకారులు
కాకినాడ బాలయోగి విగ్రహం వద్ద మత్స్యకారులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.వేటకు వెళ్లే మత్స్యకారులకు కూలీ గిట్టుబాటు కావడం లేదు. డీజిల్ పై సబ్సిడీ పెంచి ఆదుకోవాలి.మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు పూర్తిగా అందడం లేదు.మత్స్యకార ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి.మత్స్యకారుల వ్యాపారాలకు అనువైన మార్కెట్ షెడ్లు లేవు.యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు.వేటకు వెళ్లి గల్లంతైన వారి కుటుంబాలకు పరిహారం పెంచాలి.దూర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు రెండు పూటలా బస్సు సౌకర్యం కల్పించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
కాకినాడలో అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది.కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఎటువంటి నిధులు కేటాయించకుండా తీవ్రంగా దగాచేసింది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, వలలు, ఇతర పనిముట్లు అందజేశాం. టిడిపి అధికారంలోకి వచ్చాక మత్స్య సంపదను అమ్ముకునేందుకు అనువైన షెడ్లు ఏర్పాటు చేస్తాం.కాకినాడలో మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటుచేస్తాం.మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపర్చి స్థానిక మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
4).
లోకేష్ ను కలిసిన లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
కాకినాడ ఘాటీ సెంటర్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక రవాణా అధికారులు గ్రీన్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ రూపాల్లో రవాణావాహనాలను దోచేస్తున్నారు.రైత్వారీ లోడ్ లకు కూడా ఏదో ఒక కారణం చూపి రూ.30వేలు జరిమానా విధిస్తున్నారు.డీజిల్ ధరలు పెరుగుదల, కిరాయి ధరలు తక్కువ అవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం.కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి చెందిన లారీ ఓనర్లను సంఘం సభ్యత్వం తీసేసి వేధిస్తున్నాడు.మీరు అధికారంలోకి వచ్చాక లారీ ఓనర్లను ఆదుకోవాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలన కారణంగా రవాణారంగం సంక్షోభంలో కూరుకుపోయింది.ఇదివరకెన్నడూ లేనివిధంగా అడ్డగోలుగా ట్యాక్సులు పెంచడంతో ఓనర్లు డ్రైవర్లుగా మారిపోయారు.టిడిపి అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వంలో పెంచిన పన్నులను సమీక్షించి లారీఓనర్లకు ఉపశమనం కలిగిస్తాం.లారీఓనర్స్ యూనియన్ లో రాజకీయ జోక్యానికి చెక్ పెడతాం, యూనియన్లలో తలదూర్చి ఇబ్బందులకు గురిచేసే దోపిడీ దొంగలకు షాక్ ట్రీట్ మెంట్ ఇస్తాం.వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వాహనాలపై ఆంక్షలను తొలగిస్తాం.
5).
లోకేష్ ను కలిసిన మినీవ్యాన్ ఓనర్స్ యూనియన్ ప్రతినిధులు
కాకినాడ సినిమారోడ్డులో మినీ వ్యాన్ ఓనర్స్ యూనియన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి మేం నష్టాల ఊబిలో కూరుకుపోయాం.రోడ్లు పాడైపోయి వాహనాలు దెబ్బతిని తరచూ రిపేర్లు వస్తున్నాయి.గత నాలుగేళ్లుగా మినీవ్యాన్లపై ట్యాక్సులు అడ్డగోలుగా పెంచి దోచేస్తున్నారు.గతంలో రూ.3వేలు ఉండే ట్యాక్స్ ను రూ.3,600కు పెంచారు.గ్రీన్ ట్యాక్స్ టీడీపీ పాలనలో రూ.200 ఉండేది..వైసీపీ సర్కార్ రూ.6వేలకు పెంచారు.ఓవర్ లోడ్ ట్యాక్స్ టన్నుకు గతంలో రూ.2వేలు ఉండేది..నేడు రూ.20వేలకు పెంచారు.మీరు అధికారంలోకి వచ్చాక ట్యాక్సులు తగ్గించి మినీ వ్యాన్ ఓనర్లను ఆదుకోవాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్తంతాగే జలగలా తయారై పన్నుమీద పన్నులతో మోయలేని భారం మోపుతున్నాడు.జగన్ సీఎం అయ్యాక రవాణా రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు.డీజిల్ ధరలు, ట్యాక్సులు ఇష్టారాజ్యంగా పెంచి వేధిస్తున్నాడు.రోడ్లన్నింటినీ గుంతలమయంగా మారినా నాలుగున్నరేళ్లుగా తట్టెడు మట్టికూడా పోయడం లేదు.మేం అధికారంలోకి వచ్చాక గ్రీన్ ట్యాక్స్, ఓవర్ లోడ్ ట్యాక్స్ తగ్గిస్తాం.పాడైపోయిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మిస్తాం.
6).
*నారా లోకేష్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
కాకినాడ కామాక్షిదేవి గుడివద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.8 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ సమస్యలతో బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో చంద్రబాబు భరోసా ఇచ్చారు.బాధితుల వివరాలను సేకరించి, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియను ప్రారంభించారు.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వారంలో రూ.1,183కోట్లతో రూ.20వేలు లోపు ఉన్న 14లక్షల డిపాజిటర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, 10వేల రూపాయల లోపు డిపాజిట్లకు మాత్రమే అరకొరగా ఇచ్చారు.మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
మాటతప్పడం, మడపతిప్పడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడం దురదృష్టకరం.టిడిపి అధికారంలోకి వచ్చాక చట్టపరిధిలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయంచేస్తాం.
7).
*లోకేష్ ను కలిసిన దళిత సత్తా సంఘం ప్రతినిధులు
కాకినాడ వైఎస్సార్ బ్రిడ్జి వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దళిత సత్తా ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కాడు.వైఎస్ రద్దు చేసిన ఎన్.ఎస్.ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.కె.ఎఫ్.డీ.సీ పథకాలను చంద్రబాబు పునరుద్ధరించారు.జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాలను కూడా రద్దు చేశాడు.వైసీపీ పాలనలో దళితులపై దమనకాండ, హత్యలు, దురాగతాలు పెరిగిపోయాయి.దళితులకు జగన్ పాలనలో అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది.మీరు అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ కు నిధులిచ్చి ఆదుకోవాలి.జగన్ రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి.ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రతియేటా భర్తీ చేయాలి.జగన్ దళితుల వద్ద లాక్కున్న అసైన్డ్ భూములు 11వేల ఎకరాలను తిరిగి ఇప్పించాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్… దళితులను ఊచకోత దమనకాండ సాగిస్తున్నారు.దళితులను చంపి డోర్ డెలివరీ చేసే వైసీపీ నేతలను వెంటేసుకుని తిరుగుతున్నాడు.దళితులకు సంబంధించిన 27సంక్షేమ పథకాలు రద్దు చేసి ద్రోహం చేశాడు.దళితుల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్.టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ను బలోపేతం చేస్తాం.జగన్ రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం.ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేస్తాం.
8).
*లోకేష్ ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు
కాకినాడ కోకిల సెంటర్ లో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాదివ్యాంగుల జేఏసీ ప్రతినిధులుయువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి, ఇందుకోసం కమిషన్ ను నియమించాలి.పేదరిక నిర్మూలన పథకాల్లో 10శాతం మాకు రిజర్వేషన్ కేటాయించాలి.దివ్యాంగులకు సబ్ ప్లాన్ ను అమలు చేయాలి.ఏ విధమైన అడ్డంకులు లేకుండా 3ఏళ్లు పైబడిన దివ్యాంగులకు పదోన్నతులు ఇవ్వాలి.దివ్యాంగుల పెన్షన్ ను రూ.6వేలకు పెంచాలి. దివ్యాంగుల వసతిగృహాల్లో మెస్ చార్జీలు పెంచాలి.చంద్రన్న పెళ్లికానుకను తక్షణం అమలు చేయాలి.దివ్యాంగులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించాలి.మండల స్థాయిలో మానసిక వైకల్యంగలవారికి వైద్యుడిని నియమించాలి.దివ్యాంగులకు ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలి.పంచాయతీ నుండి ఎంపీ స్థాయి వరకు దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలి.దివ్యాంగులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశాడు.దివ్యాంగులపై కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్కరికి కూడా మూడు చక్రాల మోటార్ సైకిల్, పనిముట్లు ఇవ్వలేదు.స్వయం ఉపాధికి సంబంధించిన సబ్సిడీ లోన్లు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు చర్యలు తీసుకుంటాం.దివ్యాంగులకు విదేశీవిద్య, చంద్రన్న పెళ్లికానుక అమలుచేస్తాం.దివ్యాంగులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
9).
*యువనేతను కలిసిన కాకినాడ న్యాయవాదులు
కాకినాడ సంతచెరువు సెంటర్ లో కాకినాడ న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఇటీవల వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్ట వ్యతిరేకమైనది.ఈ చట్టం వల్ల ప్రజల ప్రైవేటు ఆస్తులకు రక్షణ కరువవుతుంది.ఈ చట్టం న్యాయవిరుద్దమైనది, చట్టం ముసుగులో ప్రభుత్వం మరో భూదందాకు తెరలేపింది.మీరు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేయాల్సింది కోరుతున్నాము.జూనియర్ న్యాయవాదులు దయనీయ స్థితిలో ఉన్నారు.జగన్ ప్రభుత్వం లా నేస్తం కింద నెలకు రూ.5వేలరూపాయలు ఇస్తామని చెప్పి, ఆరునెలలకు ఒకసారి మాత్రమే అరకొరగా నిధులు విడుదల చేస్తోంది.లా నేస్తం మొత్తాన్ని రూ.8వేలకు పెంచి, అర్హులైన ప్రతి ఒక్కరికీ అమలుచేయాలి.జూనియర్ న్యాయవాదులకు జీవిత బీమా కల్పించి ఆదుకోవాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలు చట్టాలతో భూదోపిడీని వ్యవస్థీకృతం చేయాలని చూస్తోంది.ప్రజల ఆస్తులను కొట్టేసేందుకే ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టవిరుద్ధమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దుచేస్తాం. జూనియర్ న్యాయవాదులకు క్రమం తప్పకుండా భృతితోపాటు జీవితబీమా సౌకర్యం కల్పిస్తాం.