మాజీ మంత్రి, బిఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓ విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నానని… రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కెసిఆర్ రాష్ట్రాన్ని ఒక మోడల్‌గా తయారు చేశారని కితాబునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఓడిపోతారని ఎవరూ భావించలేదన్నారు. ఆయన ఓడిపోయినందుకు అందరూ బాధపడుతున్నట్లు చెప్పారు. కెసిఆర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందన్నారు. మాజీ మంత్రి కెటిఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నట్లు తెలిపారు.