Suryaa.co.in

Andhra Pradesh

ఖాళీ చేయకపోతే పాతేస్తాం..

– వృద్ధురాలిపై వైసీపీ నేతల దాదాగిరి

పి నైనవరం గ్రామానికి చెందిన వైకాపా నాయకులైన గ్రామ సర్పంచి బి.సోమయ్య (చిన్నబ్బాయి), దావు వెంక టేశ్వరరావు (డీవీఆర్)లు ఈ నెల 17వ తేదీ ఆదివారం సాయంత్రం 200 మందిని వెంటబెట్టుకుని కుక్కలవారి కుంట చెరువు.. 8 ఎకరాల భూమి వద్దకు వచ్చారు. రెండు జేసీబీలు, రెండు లెవల్ ట్రాక్టర్లతో రెండు ఎకరా లోని జొన్న పంటను, 150 మామిడి చెట్లను తొలగిం చారు. వీరిని అడ్డుకుందామని తమ్మిన దుర్గాంబ కుటుంబ సభ్యులు కలిసి జేసీబీ ముందు పడుకోగా వారిని లాగిపడేశారు.

దీనిపై పోలీసు లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూస్తూ.. ఉండటం తప్ప వైకాపా ఆగడాలను అడ్డుకునే ప్రయత్నమే

చేయలేదు. సాగుదారుల కళ్ల ముందే 25 ఏళ్ల వయసున్న మామిడి చెట్లను తొలగించేశారు. మంగళవారం మధ్యాహ్నం 12. 00 గంటల లోపు స్థలం విడిచి వెళ్లకపోతే తమను అక్కడే పాతేస్తామని వైకాపా నాయకులు హెచ్చరించారని దుర్గాంబ కుటుంబీకులు వాపోయారు.

దీనిపై తమ్మిన దుర్గాంబ భర్త కృష్ణ. సోమవారం కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశారు. తమ భూమిని ఆక్రమంగా లాగేసుకుని బెదిరిస్తున్నారని విజయవాడ టూటౌన్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. సీపీఐ గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నాని, తమ పార్టీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము సాగులో ఉంటున్న భూమికి భూమి శిస్తు, ఇంటి పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆదివారం నుంచి షెడ్కు విద్యుత్తు సరఫరా తొలగించారని.. అప్పటి నుంచి చిన్న పిల్లలతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నా మని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE