– మా పోరాటల వల్ల వచ్చినవే అవన్నీ
– కేంద్రం ఏమీ ఇవ్వడం లేదనే మేం మోదీని కలవడం మానేశాం
– ఎంపీ బీ బీ పాటిల్, మాజీ ఎంపీ వినోద్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోడీ కలవడాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సమస్యల పై ప్రధాని మోడీ గారికీ వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోష దాయకం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో చాల సార్లు కేసీఆర్ మోడిని కలవడం జరిగింది.
కేసీఆర్ ప్రధాని మోడీ కలిసిన ప్రతి సారీ చూస్తామని చెప్పారు తప్పా ఒక్క రూపాయి ఇవ్వలేదు. విభజన చట్టంలో ముఖ్యంగా రహదారులు విషయంలో ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క హామీ కేంద్రం నెరవేర్చలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు రాసిన లేఖలే మరోసారి మోడీ కీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రహదారులు విషయంలో ఎన్నోసార్లు పార్లమెంట్ లో మాట్లాడం జరిగింది. 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కరు మాట్లాడలేదు .
ఇవ్వాళ బీబీనగర్ లో ఎయిమ్స్ వచ్చిందీ అంటే దానికి కారణం బీ ఆర్ఎస్ పార్టీనే. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం ఎన్నడూ కేంద్రం దగ్గర రాజీ పడలేదు, ప్రతిసారీ పార్లమెంట్ లో గోంతుచించుకుని మాట్లాడం జరిగింది.
ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం కావాలని ఎన్నో సార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసినం. ఇంత వరకు ఇవ్వలేదు. మీరు మాత్రం జిల్లాకో నవోదయ విద్యాలయం కావాలని మోడీని అడగలేదు. సైనిక్ స్కూల్ మేము అధికారంలో ఉన్నప్పుడు అడిగినం ఇస్తామని ఇచ్చారు, వరంగల్ లో భూ సేకరణ చేశాం. ఒక్క రూపాయి కేంద్రం ఇవ్వదు. మొత్తం మీరే చూసుకోవాలని అన్నారు, అలాంటిప్పుడు కేంద్రం ఎందుకు?
సైనిక్ స్కూల్ కోసం కొత్తగా అడగవల్సిన అవసరం లేదు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చిందే బిఆర్ఎస్ పార్టీ. ఖాజీ పేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉన్నది. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినప్పుడు 45 వేల కోట్ల రూపాయలతో బుందేల్ ఖండ్ కు ప్రాజెక్ట్ ఇచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఉన్నాయి అని అక్కడ మోడీ అప్పర్ భద్రకు ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సారి మోడీ అన్యాయం చేశారు. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉన్నది. బుల్లెట్ ట్రైన్ లు అన్ని ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చారు.
హైదరాబాద్ , విజయవాడ, మద్రాస్ వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని అడిగాము, దాన్ని సీఎం ,డిప్యూటీ సీఎం లు పీఎం దగ్గర ప్రస్తావించలేదు . విభజన చట్టంలో చెప్పినవి, చెప్పని వాటి కోసం ప్రతి సారీ బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. మేము ఎక్కడ తాత్సారం చెయ్యలేదు, కేసీఆర్ వందల లేఖలు మోడీ కీ రాశారు. పట్టించుకోలేదు. అందుకే మేము అప్పటి నుండి మోడీ ని కలవలేదు.