Suryaa.co.in

Andhra Pradesh

గుంటూరులో పారిశుధ్యం అధ్వాన్నం

– బిజెపి సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూపూడి రంగరాజు
కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గం
– వల్లూరు జయప్రకాష్ నారాయణ

గుంటూరు : బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న బిజెపి విజయసంకల్పయాత్ర ఈరోజు మూడవ రోజు భారత్ పేటలో ప్రారంభమై పోస్టల్ కాలనీ రత్నగిరి కాలనీ నందు ముగిసినది. బిజెపి సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూపూడి రంగరాజు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

జూపూడి రంగరాజు మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేం చేసింది ఇంకా చేయబోతున్న వేమిటి అనేది ప్రజలకు చేరువ చేయడానికి విజయ సంకల్ప యాత్రను చేపట్టామని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూపూడి రంగరాజు అన్నారు. గుంటూరులో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రం ఇచ్చిన పథకాలకు రాష్ట్రంలోని రెండు పార్టీలు కూడా స్టిక్కర్లు వేసుకుని మనుగడ సాగించాయని ఆయన విమర్శించారు.

రానున్న ఎన్నికలలో రాష్ట్రంలోని 175 సీట్లలోనూ బిజెపి పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. నగరంలో పారిశుధ్యం అద్వాన్నంగా ఉన్నదని పారిశుధ్య కార్మికులు వారి సమస్యలపై పోరాడుతుంటే కనీసం ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చలనం కూడా కలగడం లేదని రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయని ఈఅసమర్ధ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు కంకణ బద్ధులై ఉన్నారని తెలిపారు.

వెస్ట్ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. చెత్త పన్ను కడుతున్నా చెత్తను తొలగించడం లేదు‌.మోదీ గత ఐదేళ్లలో ఇచ్చిన నిధుల గురించి ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజలకు మౌళిక సదుపాయాలైన త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం వంటి వాటిని కూడా కల్పించలేకపోతున్నారు. పారిశుధ్య కార్మికులు, అంగన్ వాడీలు రోడ్ఠేక్కి ఆందోళన చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గం.

ఆందోళన 11 రోజులుగా సాగుతున్న కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు.పారిశుద్ధ్య కార్మికుల సమ్మె వల్ల పారిశుధ్య క్షీణించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్న ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ పోరాటం చేస్తాం.

జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ యాత్రలో స్థానిక ప్రజల నుండి అనూహ్యా స్పందన లభిస్తుందని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు అందతున్నాయని, అందుకు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో నాలుగో మండల అధ్యక్షులు పెమ్మరాజు సుధాకర్, ప్రధాన కార్యదర్శి పెద్దింటి కృష్ణ చైతన్య, జిల్లా ఉపాధ్యక్షురాలు మంత్రి సుగుణ, కార్యదర్శి రమాదేవి, బజరంగ్ రామకృష్ణ, మండల నాయకులు మందలపు సురేష్, రత్నాకరం, కిరణ్ కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు దారా అంబేద్కర్, చింతపల్లి వెంకట్, కేశంశెట్టి చంద్రశేఖర్, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్సులు కుమార్ గౌడ్, చెరుకూరి తిరుపతిరావు, పద్మనాభం, చంద్రశేఖర్ గుప్తా, కత్తి మేరీ సరోజిని, ఏలూరి లక్ష్మి, రాచుమల్లు భాస్కర్, ఏడుకొండలు గౌడ్, కారంశెట్టి సత్యం, అప్పిశెట్టి రంగారావు, దేసు సత్యనారాయణ, అంకాల శ్రీను, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

LEAVE A RESPONSE