Suryaa.co.in

National

రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్

సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు కనుగొన్నారు.ఈ పరికరం పనితీరు రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ ఇటీవల శ్రీనివాసరావుకి పేటెంట్ హక్కులు జారీ చేసింది. జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈయన ప్రస్తుతం ఐఐటి కాన్పూర్లో సైంటిస్ట్ గా పని చేస్తున్నారు. నాలుగేళ్లు కష్టపడి ఈ పరికరాన్ని తయారు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

LEAVE A RESPONSE