– సీఎం ఇంట్లో సంక్రాంతి సంబరాలకు కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా
-టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్
సీఎం ఇంట్లో సంక్రాంతి సంబరాలకు కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేశారని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ శర్మ తెలిపారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ శర్మ మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం…
సహజంగా ఎవరైనా దేవుడిని దర్శించుకోవాలంటే ఆలయాలకు వెళ్తారు. కాని జగన్ తన ఇంట్లోనే దాదాపు రూ. 4 కోట్లతో తాత్కాలిక దేవాలయ సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి కొత్త పద్దతలు, కొత్త విధానాలు, ఆలోచనలు జగన్ కే వస్తాయి. ఇంట్లోనే దేవాలయ సెట్టింగ్ చేసి పూజలు నిర్వహించడం భక్తి అనిపించుకోదు. భోగి రోజున ఎవరైనా తెలవారుజామునగానీ, 6.30 గంటల మొదలు 7 గంటల కల్లా భోగి మంటలు వేస్తారు.
కొందరు ఆ భోగి అగ్నిపైన్నే నీళ్లు వేడి చేసుకుని వేడి నీళ్ల స్నానం చేస్తారు. 12 గంటల సమయంలో జగన్ భోగి మంటలు వేయడం హిందూ సాంప్రదాయానికి విరుద్దం. జగన్ కు హిందూ సంప్రాదాయాలపై, హిందువులపై ఏమాత్రం గౌరవం లేదు, జగన్ హిట్లర్ లాగ ఎవరి మాట వినడు. రూ. 4 కోట్లతో ఇంట్లోనే పెద్ద సెట్టింగ్ వేసి సంక్రాంతి సంబరాలు చేసేకంటే శాశ్వత దేవాలయ నిర్మాణం చేపట్టివుంటే అది నలుగురికి ఉపయోగపడేది. అసలు ఏ ప్రభుత్వ శాఖ నుండి ఈ నిధులు ఖర్చు పెట్టారో తెలియాలి.
టీటీడీ బోర్డు నుండినా? లేక ప్రొటోకాల్ ఖర్చు నుండా? ఎవరు ఖర్చు పెట్టారో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి. జగన్ ప్యాలెస్ కు 5 కిలోమీటర్ల దూరంలో గల వెంకటాయపాలెంలో టీటీడీ వారు కట్టిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడికి వెళ్లి జగన్ పూజలు నిర్వహించి ఉండివుండవచ్చు. ప్రజా ధనం వృధా అయ్యేది కాదు. ఎందుకు 4 కోట్ల రూపాయలు ఎందుకు వృదా చేశారో ప్రజలకు సమాధానమివ్వాలి.
ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క గుడికైనా సతీ సమేతంగా వెళ్లారా? లేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు ఎవరైనా సరే భార్య సమేతంగా వెళ్తారు, అయితే జగన్ మాత్రం భార్య సమేతంగా ఎప్పుడూ వెళ్లలేదు. సంక్రాంతి సమయంలో ఇంట్లో చేసిన పూజలు తన రాజకీయ ప్రయోజనాల కోసం చేసినట్లు స్పష్టమౌతోంది. మణిపూర్ లో 2 వేల చర్చీల్ని ఇతర మతస్థులు ధ్వంసం చేసినందుకు, వారిపట్ల చర్యలు తీసుకోవాలనే బాధతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని షర్మిల చెప్పడం అభినందనీయం.
అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగబోతోంది. మొదట అక్కడ ప్రాణప్రతిష్ట చేస్తారు. జగన్ అలాగే తన ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేసేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రాణ ప్రతిష్ట చేయాల్సి ఉండగా అలాంటిదేమీ చేయలేదు. పైగా దేవుడి ప్రసాదం తీసుకుని పక్కన పెట్టిన పరిస్థితి చూస్తే జగన్ కు హిందూ సాంప్రదాయాలపై ఎంతమాత్రం గౌరవం, భక్తి లేదని తెలుస్తోంది.
జగన్ ప్రసాదం తీసుకుని పక్కన పెట్టేయడం హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లైంది. జగన్ తన అవసరాలకు కోట్లు ఖర్చు చేస్తారు గానీ ప్రజల అవసరాలకు పైసా కూడా ఖర్చు చేయరు. జగన్ క్రైస్తవ మతం, హిందూ మతంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలి. తొలుత జగన్ హిందువో, క్రైస్తవుడో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. తాను క్రైస్తవుడినని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. అలాగే హిందూ సాంప్రదాయాలను మనస్పూర్తిగా పాటించలేకపోతున్నారు.
రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ నెట్టుకొస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను ఉపయోగించుకోవడం తగదు. ఇప్పటికైనా జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను ఉపయోగించుకోవడం మానాలి. జగన్ హిందువో, క్రైస్తవుడో ప్రజలకు పూర్తిగా క్లారిటీ ఇవ్వాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాం ప్రసాద్ శర్మ తెలిపారు.