అయోధ్యకు అందరూ రండి..

– కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయా పరిసరాల్ని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేసారు, నీటితో ఆలయ గోపురాల్ని కడిగారు అనంతరం తన స్వహాస్తలతో స్వయంగా విగ్రహ మూర్థుల్ని శుద్ధి చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 22న అయోధ్య లో నూతనంగా నిర్మించిన రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరుగుతుంది.500ఏళ్ళ హిందువుల ఆకాంక్ష నేరవెరబోతోంది .

ఈ మహా ఘట్టం కోసం ప్రపంచంలోని కోట్లమంది హిందువులు ఎదురుచూస్తున్నారు.అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ సందర్భంగా సంక్రాంతి నుంచి ఈ నెల 22వరకు మన పరిసరాల్లోని ప్రతి ఆలయాన్ని శుబ్రంగా ఉంచాలనే స్వచ్ఛ అభియాన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు

ఈ మేరకు ఈ రోజు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. మీ ప్రాంతాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కటోరమైన ఉపవాస దీక్ష చేస్తున్న మోడీకి యావత్ సమాజం మద్దతునివ్వాలని కోరారు. యావత్ దేశమే కాదు ప్రపంచంలోని హిందువులందరు ప్రత్యక్షంగా పరోక్షంగా లైవ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.ప్రతి ఇంట్లో, ప్రతి వాడ,లో ప్రతి ఊర్లో, ప్రతి దేవాలయంలో 22న ఈ కార్యక్రమంలో పాల్గొనాలని లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి లేని పిలుపునిచ్చారు.

మీ ఇళ్లను ప్రతి దేవాలయన్ని అలంకరించండి ఇంట్లో దేవాలయాల్లో దీపాలను వెలిగించండి .దేవాలయాల్లో మహహరతి కార్యక్రమంలో పాల్గొనండి ప్రసాద వితరణ కార్యక్రమన్ని చేపట్టండి ప్రసాదాన్ని అందరూ స్వీకరించండి. కులమతాలకు వర్గాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఇంట్లో ప్రతి గుడిలో ఆ రోజు భక్తి బావంతో ఉండాలని ప్రజలను కోరారు.

Leave a Reply