చెన్నై ఎయిర్ పోర్టులోకి వరద…విమానాలు నిలిపివేత

మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు నగరాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. అంతేగాకుండా డిసెంబర్ 4న దాదాపు 11 విమానాలను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)కి మళ్లించారు. చెన్నైలో దిగాల్సిన దేశీయ అంతర్జాతీయ విమానాలను KIA కి మళ్లించినట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ధృవీకరించారు. మైచాంగ్ తుఫాను కారణంగా చెన్నె విమానాశ్రయం వరదలతో నిండిపోయింది.

దారి మళ్లించిన 11 విమానాలు ఇవే
బీఐఎల్ అధికారుల వివరాల ప్రకారం ఇండిగో, స్పైస్ జెట్, ఎతిహాద్, గల్ఫ్ ఎయిర్, ఫ్లై దుబాయ్, ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్లు చెన్నె నుండి బెంగళూరుకు వెళ్లే విమానాలను దారి మళ్లించాయి. ఇప్పటివరకు 10 మళ్లించిన విమానాలు KIA వద్ద ల్యాండ్ చేయబడ్డాయి మరొకటి దారిలో ఉంది . రానున్న గంటల్లో మరిన్ని విమానాలను KIAకి మళ్లించే అవకాశం ఉందని అధికారులు ధృవీకరించారు భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో కార్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply