మైచాంగ్ ఎఫెక్ట్ కంటే.. పక్క రాష్ట్ర పాలిటిక్స్ ఎఫెక్ట్ జగన్ రెడ్డికి బాగా తగిలింది

• వెన్నుపూస లేని ముఖ్యమంత్రి వెన్నులో భయం మొదలైంది.
• మిగ్ జాం తుఫాన్ వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టానికి ముఖ్యమంత్రే బాధ్యుడవుతాడు
• భారీ గాలులతో వరి, ఉద్యానవన పంటలు దెబ్బతింటాయని తెలిసినా.. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు?
• కనీసం ధాన్యం తడవకుండా చేసేలా టార్పాలిన్లు కూడా రైతులకు ఇవ్వలేదు
• ధాన్యం సేకరణకు అవసరమైన హార్వెస్టర్లు.. ట్రాక్టర్లు అందుబాటులో లేవు
• తుఫాన్ ప్రాంతాలకు నిధులిస్తే.. ప్రభుత్వం పని అయిపోయినట్టేనా?
• తుఫాన్లు.. విపత్తుల సమయంలో రైతుల్ని ఆదుకోవడానికి.. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి, అధికారులతో పరిస్థితిని చక్కదిద్దేవాడు
• జగన్ రెడ్డి అసమర్థుడు అయినంతమాత్రాన..అధికారులు తమ సమర్థత కోల్పోవాల్సిన పనిలేదు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం.. చేతగానివిధానంతో రైతాంగం తీవ్రమైన కష్టాలు అనుభవిస్తోందని, వరదలు.. తుఫాన్లు వచ్చినా, కరువు పరిస్థితులు తలెత్తినా రైతుల్ని ఆదుకోవాలనే కనీస స్పృహ కూడా పాలకులకు లేకుండా పోయిందని, మిగ్ జాం ఎఫెక్ట్ కంటే.. పక్కరాష్ట్ర రాజకీయాల ఎఫెక్ట్ జగన్ రెడ్డికి బాగా తగిలిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫల మైంది. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీళ్లు అందక వరి పైరు ఎండిపోయింది. ఆ ప్రాంతాల్లోనే కాదు.. రాయలసీమకు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు అందించలేకపోయింది. రైతుల గురించి ఆలోచించకుం డా.. వ్యవసాయం గురించి పట్టించుకోకుండా.. నాగార్జున సాగర్ డ్యామ్ పై కావా లనే నాటకాలు ఆడారు. నీటికేటాయింపులకు సంబంధించిన ఇండెంట్ పెట్టకుండానే… పోలీసుల్ని డ్యామ్ పైకి పంపి యుద్ధవాతావరణం సృష్టించారు. ప్రభుత్వం ఈ పని చేయకముందు.. ప్రకాశం జిల్లాకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయింది.

ధాన్యం తడవకుండా జగన్ రెడ్డి.. రైతులకు టార్పాలిన్లు కూడా అందించలేదు ఎన్ని ఆర్బీకేలు…ఎందరు అధికారులు రైతులకోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి
మిగ్ జాం తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సహాయ చర్యలు చేపట్టలేదు. యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో విఫలమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతా లకు కోటిరూపాయల చొప్పున నిధులు విడుదలచేస్తే రైతుల సమస్యలు తీరిపో తాయా? వరిపైరు కోతకొచ్చింది.. కొన్ని చోట్ల తుఫాన్ హెచ్చరికలతో రైతులు హార్వెస్టర్లతో ధాన్యం కుప్పలు పోసేశారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండాల్సి న ప్రభుత్వం సర్వరోగాలకు నివారిణిగా ఆర్బీకేలు (రైతుభరోసా కేంద్రాలు) ఉన్నాయని చెబుతూ తప్పించుకుంటోంది.

ధాన్యం తడవకుండా చేసేందుకు అవసరమైన టార్పాలిన్లు రైతులకు అందించలేదు. ఎన్ని ఆర్బీకేలు రైతులకోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఎందరు సిబ్బంది, అధికారులు రైతులవద్దకు వెళ్లారు.. ఎన్ని హార్వెస్టర్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది? టీడీపీప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వందలాది హార్వెస్టర్లు.. ట్రాక్టర్లు రైతులకు అందుబాటులో ఉంచి ధాన్యాన్ని పొలాల్లో నుంచి సురక్షితప్రాంతాలకు తరలించాం. ధాన్యం వెంటనే కొని.. రైతుల్ని ఆదుకున్నాం. తన సుందర ముఖారవిందం అందరూ చూడాలని అన్నింటిపై జగన్ రెడ్డి తన ఫోటోలు.. బొమ్మలు వేయిస్తున్నాడు. కనీసం ఆ పనే చేసి.. రైతులకు టార్పాలిన్లు కూడా అందించలేకపోయాడు.

తుఫాన్లు.. విపత్తుల సమయంలో చంద్రబాబు నేరుగా జనంలోకి వెళ్లి..అధికారులతో సమర్థవంతంగా పనిచేయించాడు. జగన్ రెడ్డేమో బిక్కుబిక్కుమంటూ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడంలేదు
ప్రచండ వేగంతో మిగ్ జాం తుఫాన్ రాష్ట్రాన్ని కమ్మేస్తుంటే.. రైతుల్ని, మత్స్యకారుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? నీరోచక్రవర్తిలా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటే సరిపోతుందా? టీడీపీప్రభుత్వంలో చంద్రబాబు నేరుగా రైతులవద్దకు వెళ్లి.. వారికి అండగా నిలిచారు. అలానే వేటకు వెళ్లడం వీలుకానప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థికసహాయం..నిత్యావసరాలు అందించారు. హుద్ హుద్ తుఫాన్ విశాఖ మహానగరాన్ని ధ్వంసం చేస్తే.. కేవలం వారంలోనే నగరం మొత్తాన్ని చక్కదిద్దిన ఘనత చంద్రబాబుది.

ఆయన పరిపాలనా దక్షత అలాంటిది. కానీ నేడు జగన్ రెడ్డి ఏంచేస్తున్నాడు? అధికారు ల్లోనే చలనం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించడంలేదు. ముఖ్యమంత్రేమో బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో తాడేపల్లి నుంచి బయటకు రాడు. తాను కదలడు సరే.. కనీసం అధికారుల్ని అయినా జిల్లాలకు పంపాలి కదా! మిగ్ జాం తుఫాన్ తీరం దాటేటప్పుడు భారీస్థాయిలో గాలులు వీస్తాయి.. దాంతో చాలాప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం.. విద్యుత్ స్తంభాలు నేలకొరగడం.. తీరప్రాంతాల్లోని నివాసాలు దెబ్బతినడం జరుగుతుంది. వీటన్నింటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండి .. ఆస్తి, ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి.. ఈ ప్రభుత్వం రైతుకూలీలు..రైతు వ్యతిరేక ప్రభుత్వం. నీటిపారుదల.. గ్రామీణ పంచాయతీరాజ్.. వ్యవసాయ శాఖాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు అండగా ఉండాలని కోరుతున్నాం. చంద్రబాబునాయుడు ప్రకృతి విపత్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారని పేరు. ఆయన హాయాంలో తుఫాన్లు .. వరదలు వచ్చి నష్టం జరిగినా.. బాధితులకు వెంటనే సహాయ అందేది. అధికా రులు ఆఘమేఘాలపై స్పందించేవారు. ఈ ప్రభుత్వం..ముఖ్యమంత్రిలోనే చలనం లేకపోతే.. అధికారుల్లో ఉంటుందా?

పక్క రాష్ట్ర పరిణామాలతో జగన్ రెడ్డికి భయం పట్టుకుంది. అందుకే తుఫాన్ వచ్చినా.. ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతున్నాడు
ఈ ముఖ్యమంత్రికి నిన్న పక్కరాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. ఏపీతో పోలిస్తే అక్కడ జరిగిన అవినీతి తక్కువే. దానికే అక్కడి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని పీకిపారేశారు. దాంతో ఏపీలో తనపరిస్థితి..తన ప్రభుత్వ పరిస్థితి ఏమిటనే భయం జగన్ రెడ్డికి పట్టుకుంది. ప్రజల్లోకి వెళ్లి.. వారి సమస్యలు తెలుసుకొని వారికి వెన్నుదన్నుగా నిలవలేని..వెన్నుపూస లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. గతంలో ఉభయరాష్ట్రాల మధ్య నీటివివాదం తలెత్తిన ప్పుడు చంద్రబాబు గవర్నర్ తో సంప్రదించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూశారు.

ఈ ముఖ్యమంత్రిలాగా ప్రజల్ని మోసగించడానికి డ్యామ్ లపైకి పోలీసుల్ని పంపలేదు. వారంవారం బటన్ నొక్కుడు అంటూ ప్రచారపిచ్చితో ప్రజలసొమ్ము తన సాక్షి దినపత్రికకు.. తనకు బాకా ఊదే మీడియాకు దోచిపెడు తున్నాడు. తుఫాన్ వల్ల జరిగే నష్టానికి ముఖ్యమంత్రే బాధ్యుడు. సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాన్ ప్రభావాన్ని ముందే గుర్తించి.. రైతుల్నిఅప్రమత్తం చేసి.. అధికారుల్ని రంగంలోకి దించితే నష్టం జరక్కుండా ఉంటుంది. అసలు అలాంటి ఆలోచనే జగన్ రెడ్డి చేయడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి..ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు.

అధికారులు.. మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలోని కొందరుఅధికారులు ఇప్పటికైనా తమ పనితీరు మార్చుకుంటే మంచిది. తెలంగా ణ డీజీపీకి పట్టిన గతి పట్టేవరకు పరిస్థితి తెచ్చుకోవద్దని హితవుపలుకుతున్నాం . ప్రభుత్వానికి తొత్తులుగా మారి.. అరాచకానికి పాల్పడే వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ముఖ్యమంత్రి అసమర్థుడిగా ఉన్నంత మాత్రాన అధికారులు తమ సమర్థతను కోల్పోవాల్సిన పనిలేదు.” అని బుచ్చయ్యచౌదరి సూచించారు.

Leave a Reply