అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, తనయుడు రాంచరణ్ హజరయ్యారు. అక్కడ తనకు ఎదురైన అంబానీని పవన్ కల్యాణ్ పలకరించారు. అయోధ్య ట్రస్టు ప్రతినిధులు స్వయంగా వారికి ఆహ్వానపత్రాలు అందించిన విషయం తెలిసిందే.
కాగా చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాపనకు ఒకరోజు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఆయనకు ట్రస్టు సభ్యులు స్వాగతం పలికారు. తెలుగురాష్ర్టాల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దక్షిణభారతదేశంలో విపక్ష నేత చంద్రబాబునాయుడు ఒక్కరే ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం.
అక్కడ ఆయన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతోపాటు, పలువురు సాధువులు, జాతీయ ప్రముఖులతో ముచ్చటించారు. ముందు వరసలో కూర్చున్న చంద్రబాబునాయుడును చూసిన పలువురు ప్రముఖులు, ఆయన వద్దకు వచ్చి పలకరించి వెళ్లడం కనిపించింది. ఇక సూపర్‌స్టార్ అమితాబ్, రజనీకాంత్ కూడా అయోధ్యకు వెళ్లినవారిలో ఉన్నారు.