గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రచ్చకెక్కిన విభేదాలు

– అధికారుల కుమ్ములాట
– కిందిస్థాయి సిబ్బందికి కాసులు కురిపిస్తున్న కార్యాలయం
– గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఉన్నతాధికారుల ఆగ్రహం?

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారుల కుమ్ములాట కారణంగా క్రింది స్థాయి సిబ్బందికి ప్రతిరోజు కాసులు పంటగా మారింది. ఇప్పటికే గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తారని పేరు రాష్ట్రవ్యాప్తంగా ఉంది. కార్యాలయం అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

గుడివాడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రక్షాళనకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గుడివాడ కార్యాలయంలో ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా క్షణాల్లో జరిగిపోతుందనే పేరు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉంది. సామాన్య ప్రజలకు రిజిస్టర్ కార్యాలయంలో పడి కాపులే సకాలంలో రిజిస్ట్రేషన్ చేసిన పాపాన పోలేదని సామాన్య ప్రజలు పేర్కొంటున్నారు.

Leave a Reply