Suryaa.co.in

Andhra Pradesh

జనవంచన జగన్ ప్రభుత్వానికి ట్రేడ్ మార్క్ గా మారింది

– మద్యపాననిషేధం అనిచెప్పినవారు, మద్యం డిపోలను 22ఏళ్లపాటుతాకట్టుపెట్టి రూ.25వేలకోట్ల అప్పులు తెచ్చారు. మద్యాన్ని ప్రధానఆదాయవనరుగా మార్చుకున్న ప్రభుత్వం, ప్రజల రక్తాన్ని తాగుతోంది.
– మహాపాదయాత్రకు లభిస్తున్న ప్రజామద్థదు చూడలేకే, ప్రభుత్వం పోలీస్ బలాన్ని నమ్ముకొంది.
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
రాష్ట్రప్రభుత్వ వైఖరి, విధానం చాలాఆందోళనకరంగా ఉందని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులఊబిలోకి నెట్టేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, ఆర్థికంగా దివాళా తీసిందని ఎన్నికలకు ముందుఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడటం అధి కారపార్టీకి అలవాటుగా మారిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్లనరేంద్ర స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీ య కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఎన్నికలకు ముందుపాదయాత్రచేసిన జగన్మోహన్ రెడ్డి, విచ్చలవిడిగా హామీలిస్తే, వైసీపీనేతలు, కార్యకర్తలు మేనిఫెస్టోపేరుతో ఆ పత్రాలను ప్రజలముందుంచారు. వాటిలో ప్రధానమైన మద్యపానినిషేధం ఇప్పుడు ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వవిధానం చూస్తుంటే, నిషేధానికి బదులు మద్యాన్ని ప్రమోట్ చేస్తోంది. ప్రభుత్వం ప్రజలవిస్వనీయత కోల్పోయిందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి, ఆయనపార్టీ చెప్పిన మద్యపాననిషేధం ఏమైంది? వైసీపీనేతలు, కార్యకర్తలు అక్రమమద్యం వ్యాపారంలో మునిగితేలుతూ, మద్యంఅమ్మకాలనే ప్రధానఆదాయవనరుగా మార్చుకున్నారు.
దశలవారీ మద్యపాన నిషేధం అనిచెప్పి, దశలవారీగా మద్యంఅమ్మకాలను పెంచుకుంటూ పోతున్నారు. విచిత్రమైనపేర్లతో కొత్తకొత్తబ్రాండ్లను వైసీపీనేతలకు చెందిన డిస్టిలరీలే మార్కెట్లోకి వదులుతున్నారు. ప్రభుత్వపెద్దలు, అధికారపార్టీనేతలు వదిలే కొత్తతరహా మద్యంతో ప్రజలప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నాణ్యతలేని మద్యం పేదలప్రాణాలు తీస్తున్నాకూడా, ప్రభుత్వం వారి రక్తంతాగడానికి కూడా వెనుకాడటంలేదు. ఈ ప్రభుత్వంలో మద్యంపై వచ్చేఆదాయం రూ.20వేల కోట్లకు పైబడేఉంది. జీవోనెం-90ద్వారా అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరుతో 10మద్యం డిపోలకు సంబంధించిన ఆదాయాన్ని ప్రభుత్వం అప్పులకోసం తాకట్టుపెట్టింది నిజమా…కాదా?
మద్యంపై వచ్చే ఆదాయాన్ని 22 ఏళ్లపాటు, రూ.25 వేలకోట్ల అప్పులకోసం తాకట్టు పెట్టిన ప్రభుత్వం, మద్యనిషేధం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. జనవంచన అనేది జగన్ ప్రభుత్వానికి ట్రేడ్ మార్క్ గా మారింది అధికారంలోకివచ్చాక జగన్ ప్రభుత్వం మద్యాన్ని బంగారుబాతుగా మార్చుకుంది. అక్రమమద్యం అమ్మకాలతో అధికారపార్టీనేతలు రాబడి పెంచుకుంటుంటే, ప్రజలజీవితాలు మంటగలుస్తున్నాయి. నాణ్యతలేని మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం వారి రక్తం తాగడానికే ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలోప్రభుత్వమే బెల్టుషాపులను నిర్వహిస్తోంది. బెల్టుషాపులు లేనిగ్రామం ఏపీలో ఎక్కడైనాఉందా? ఏఊళ్లో చూసినా, ఇళ్లు, గుళ్లు, పాఠశాలలమధ్యన ప్రభుత్వమే బెల్టుదుకాణాలు నిర్వహిస్తోంది. వాటిని స్వయంగా అధికారపార్టీనేతలే నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం రాష్ట్రఖజానాకు వచ్చే డబ్బుని ఏపీబీఎస్ సీఎల్ (ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్) కు మార్జిన్ గా ఇచ్చి, కొత్తఅప్పులకోసం పన్నాగం పన్నింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనేది చట్టవిరుద్ధమని కేంద్రంచెప్పినా, దానిముసుగులో జగన్ ప్రభుత్వం అప్పులుతేవడమేంటి? గవర్నర్ పేరుతో రుణాలుతీసుకోవడం రాజ్యాంగఉల్లంఘన కాదా అని హైకోర్టే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్థికంగా దివాళాతీయబట్టే, ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థల ను అప్పులకోసం తాకట్టుపెడుతోంది.
మహాపాదయాత్రకు లభిస్తున్న ప్రజామద్ధతు చూడలేకే, ప్రభుత్వం పోలీసుబలాన్ని నమ్ముకుంది.ప్రభుత్వదయాదాక్షిణ్యాలతో రాజధానిరైతుల మహాపాదయాత్ర జరగడంలేదు. హైకోర్టు అనుమతితో జరుగుతోంది. పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘిస్తే, ప్రభుత్వం కోర్టుని ఆశ్రయించకుండా, పోలీసు బలంతో అడ్డుకోవాలని చూడటమేంటి? 700రోజులుగా రాజధాని రైతులు, మహిళలు పోరాడుతున్నా, ప్రభుత్వం స్పందిం చలేదు కాబట్టే, రాజధాని రైతులు దేవుణ్ణి, న్యాయస్థానాలను నమ్ముకున్నారు. ప్రజలం తా స్వచ్ఛందంగా, ఉరకలువేసేఉత్సాహంతో పాదయాత్రలో భాగస్వాములవుతుండటంతో, పాలకులకు నిద్రపట్టట్లేదు. నేను పాద యాత్రలో పాల్గొన్నప్పుడు, కర్నూలు, ఉభయగోదావరి, శ్రీకాకుళం జిల్లావారిని చూశాను. పాదయాత్రలో రాజకీయపార్టీ జెండాలు ఎక్కడా కనిపించడంలేదు, కేవలం అమరావతిజెండాలు తప్ప.
పాదయాత్రలో పాల్గొంటు న్నవారి ముఖాలపై పలానాపార్టీ అనిరాసుకున్నట్టు పోలీసులకు కనిపిస్తోందా? అదేమీలేనప్పుడు, ఫలానాపార్టీవారు అమరావతి ఉద్యమం నడుపుతున్నారని, పాదయాత్రకు సహకరి స్తున్నారని ఎలాచెబుతారు? అన్నంపెట్టేరైతులు, తమసర్వస్వాన్ని రాష్ట్రం కోసం ధారపోసి రోడ్డెక్కితే, వారికి కులాలు, మతాలు, పార్టీలు అంటగట్టడం ఈ ప్రభుత్వానికేచెల్లింది. అమరావతి ఉద్యమం 29 గ్రామాల ఉద్యమంకాదని, ఆంధ్రప్రదేశ్ ఉద్యమమని పాలకులకు అర్థమైందికాబట్టే, పోలీసుల్ని రంగంలోకి దింపారు. కుట్రలు, కుతంత్రాల తో అమరావతి ఉద్యమాన్ని ఆపడానికి ప్రభుత్వంచేసిన ప్రయత్నాలన్నీ ఎప్పుడో విఫలమయ్యాయి. అందుకే ఇప్పుడు పోలీస్ బలంతో మహా పాదయాత్రను అడ్డుకుంటున్నారు.
పోలీసులకు కూడా కుటుంబాలు ఉన్నాయి..అమరావతి రైతులు తిరుమలేశుడిసన్నిధికి వెళుతుంటే, పాలకులుచెప్పారని పోలీసులు అడ్డుకోవాలని చూడటం తగదు. అధికా రాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ఎంతదాష్టీకానికి పాల్పడుతోందో, అనంతపురంలో విద్యార్థులపై జరిగిన అమానుషమే నిదర్శనం. పేద తరతరాలనుంచి తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న విద్యాసంస్థలను కాపాడుకోవడానికి విద్యార్థులు ముందుకురావడం తప్పా? అమరావతి రైతులు, మహిళలకన్నీళ్లతో ప్రభుత్వం పతనం కావడం ఖాయం.

LEAVE A RESPONSE