జగ్గయ్యపేట: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన సందర్భంగా జగ్గయ్యపేట పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ఉమ్మర్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ని పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజాసేవా తపనను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో పాటు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ప్రార్థిస్తూ ప్రత్యేక దువాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ అక్బర్ ,తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు షేక్ మదార్, మాబు మియా, దర్గా ప్రెసిడెంట్ షేక్ రఫీ, బిలాలు, అబూ బాకర్, రహీం, ఇలియాజ్, పట్టణ ముస్లిం మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ నాగుల్ మీరా,పట్టణ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాలిబాబు, అహ్మద్ , బాజీ తదితరులు పాల్గొన్నారు.