– ఎల్ అండ్ టీ సిమెంట్, ఆదానీ హైడ్రో ప్రాజెక్ట్ వద్ద కూడా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల బెదిరింపులు
– కాకినాడ పోర్టులో అరబిందో కంపెనీ, కృష్ణపట్నం పోర్ట్, భవ్య సిమెంట్స్ యాజమాన్యానికి కూటమి ఎమ్మెల్యేల వేధింపులు
– వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ కేసులు, రాజకీయ కక్షసాధింపు చర్యలు అధికమయ్యాయి. పరిశ్రమలపై కూటమి నాయకుల వేధింపులు, ఆర్గనైజ్డ్ అవినీతి జరుగుతోంది. వైయస్ఆర్ జిల్లా చిల్లంకూరులో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరింపులు.ఫ్యాక్టరీకి వెళ్లే కార్మికులు, వాహనాలను అడ్డుకున్నారు. ఆ ఫ్యాక్టరీలో 89% స్థానికులే పనిచేస్తున్నారని అధికారులు నివేదిక ఇచ్చినా వేధింపులు కొనసాగుతున్నాయి.
పరిశ్రమల నుంచి వాటా కోసం ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఎల్ అండ్ టీ సిమెంట్, ఆదానీ హైడ్రో ప్రాజెక్ట్ వద్ద కూడా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. కాకినాడ పోర్టులో అరబిందో కంపెనీ, కృష్ణపట్నం పోర్ట్, భవ్య సిమెంట్స్ యాజమాన్యానికి కూటమి ఎమ్మెల్యేల వేధింపులు తప్పలేదు. పల్నాడు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పరిశ్రమలపై దాడులు, కప్పం చెల్లించాలని అధికార పార్టీ నేతల నుంచి డిమాండ్లు. లారీలు, ముడి సరుకుల రవాణాపై అడ్డంకులు సృష్టిస్తున్నారు.
కూటమి ఎమ్మెల్యేల చేతుల్లో పారిశ్రామికవేత్తలు వేధింపులకు గురవుతున్నారు. పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి, ఇవాళ బాహటంగా కూటమి నేతలు పరిశ్రమల వద్ద దోపిడీకి పాల్పడుతున్నారు. పరిశ్రమలను బెదిరిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? కూటమి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారు.