Suryaa.co.in

Telangana

2 నెలల్లో 14 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు?

పోలీసు స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసులు పెట్టాలి
స్టాఫ్ నర్స్, పోలీసు ఉద్యోగాలు మేము ఇచ్చినవే
2 లక్షల ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే
ఇచ్చేదాక ఊరుకునేది లేదు.

– పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు

మూడోసారి మహబూబాబాద్ ఎంపి సీటు గెలవాలి. అందరం కృషి చేయాలి. మార్పు వచ్చింది..కరెంట్ కోతలు వచ్చాయి, రైతు బంధు పడటం లేదు, పింఛన్లు రావడం లేదు. ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. 12 మంది సోదరులు మృతి చెందారు. ఆటో కార్మికులకు నెలకు 10 వేలు అందించాలి.

రైతు బంధు పడలేదు అంటే చెప్పుతో కొట్టండి అంటడు ఒక మంత్రి. ఫిబ్రవరి వరకు ఏనాడైనా రైతు బంధు పడకుండా ఉందా? కరోనా వచ్చినప్పుడు ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి రైతులకు రైతు బంధు ఇచ్చారు. 2 నెలల్లో 14 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు?

ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టారు. తెలంగాణకు అన్యాయం చేశారు. మంజూరు చేసిన పనులు కొనసాగించాల్సింది పోయి రద్దు చేయడం బాధాకరం. ఇదే విషయంపై ఎక్కడికక్కడ ఫ్లెక్సీ కట్టాలి. వాస్తవాలు వెల్లడించాలని కోరుతున్నా. జాబ్ క్యాలెండర్ అని పత్రికల్లో యాడ్ ఇచ్చి మోసం చేసింది ఎవరు? ఫిబ్రవరి 1 వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నారు. రుణమాఫీ చేస్తాం అని మోసం చేశారు.

పోలీసు స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసులు పెట్టాలి. కాంగ్రెస్ మోసాలను బయట పెట్టాలి. మహిళలు ఉచిత బస్సు ఎక్కాలి, ధర్నాలు చేయాలి. ప్రజల పక్షాన అందరం కలిసి పోరాటం చేస్తాం. మీకు సమస్య వస్తే బస్సు వేసుకొని వచ్చి మీ తరుపున పోరాటం చేస్తాం. ఆయిల్ ఫామ్ రైతులకు 15 వేలు మద్దతు ఇచ్చేదాకా పోరాటం చేస్తాం.

చంద్రబాబు, వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమం చేశాం. వెనుకడుగు వేయలేదు. హైదరాబాద్ లో నా మీద కేసు పెట్టని పోలీసు స్టేషన్ లేదు. అయినా ఉద్యమం కోసం వెనుకడుగు వేయలేదు. నిరుద్యోగ భృతి మేము చెప్పలేదని భట్టి మాట తప్పారు. స్టాఫ్ నర్స్ పోస్టుల ఘనత మాదే అని చెప్పుకోవడం సిగ్గు చేటు. కానిస్టేబుల్ పోస్టులకు మేమే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించాం. దీన్ని కూడా మేమే ఇచ్చాం అంటున్నారు. స్టాఫ్ నర్స్, పోలీసు ఉద్యోగాలు మేము ఇచ్చినవే. అది మీ ఘనత కాదు. 2 లక్షల ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఇచ్చేదాక ఊరుకునేది లేదు.

 

LEAVE A RESPONSE