2024 ఎన్నికల్లో వైసీపీ ఆల్ ఔట్

– ప్రజా వ్యతిరేక సునామీలో జగన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం
– ఓటమి భయంతో జగన్ రెడ్డి అవాకులు, చెవాకులు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు

చంద్రబాబు నాయుడు రా…కదలిరా సభలకు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ ఫ్యాను రెక్కలు విరిగిపోతున్నాయి. ప్రజా వ్యతిరేక సునామీలో తాను కొట్టుకుపోవడం ఖాయమనే భయం జగన్ రెడ్డిలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మారీచుడు యజ్ఞాన్ని భగ్నం చేసినట్టు రాష్ట్ర అభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని ధ్వంసం చేసిన నీకు ఓటనే ఆయుధంతో రాజకీయ సమాధి కట్టడం ఖాయం.

యుద్ధానికి ముందే ఓటమి ఒప్పుకున్న పిరికిపంద జగన్ రెడ్డి మాపై విమర్శలు చేయడమా? తాడేపల్లి ప్యాలెస్ గేటు ముందు నీకు శాపనార్థాలు పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలే నీ ఓటమికి సజీవ సాక్ష్యాలు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు కూడా ఇష్టపడని నువ్వు పెత్తందారుడు కాక మరేమిటి? ఏది సంక్షేమం జగన్ రెడ్డీ? ధరలు, పన్నులు, చార్జీల బాదుడుతో ప్రజల నడ్డి విరిచేయడమా?

2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి జాబ్ లెస్ క్యాలెండర్‌తో యువత భవితను ప్రశ్నార్థకం చేయడమా? ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ అదే నిజమని ఇన్నాళ్లూ నమ్మించిన జగన్ రెడ్డిని మరోసారి నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఆల్ ఔట్ అవ్వడం ఖాయం.

 

Leave a Reply