– దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గా శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారు. మంథని నుంచి మూడుసార్లు శ్రీపాదరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీపాద రావు లాంటి నాయకులు తెలంగాణకు గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీధర్ బాబు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
శ్రీపాదరావు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీధర్ బాబు తనను తాను నిరూపించుకున్నారు. ప్రయోజకుడిగా మారిన శ్రీధర్ బాబును ఇప్పుడు చూస్తే శ్రీపాదరావు సంతోషించేవారు. ట్యాంక్ బండ్ పై ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న వక్తల సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం. చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటును పరిశీలిస్తాం. త్వరలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి విధానపరంగా మంచి నిర్ణయం తీసుకుంటాం.